వైసిపి ప్రభుత్వంలో ఆరాచక పాలన కొనసాగుతోంది, ప్రొద్దుటూరులో వ్యాపారస్తుల దగ్గరకు వచ్చిన వినియోగదారుల డబ్బులను రైడ్ చేసి పట్టుకునే విషయం స్థానిక ఎమ్మెల్యేతోపాటు, సీఎం జగన్మోహన్రెడ్డికి కూడా తెలుసునని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆరోపించారు. లోకల్ బాస్ ఆదేశాలతోనే ఇదంతా జరుగుతోందని, కూతురు పెళ్ళి కోసం బంగారం కొనేందుకు వచ్చిన వారి నుంచి డబ్బులు పట్టుకుని ఐటి అధికారులకు అప్పజెప్పడం దారుణమన్నారు. ఓ సామాన్య వ్యక్తి తన కూతురు పెళ్ళి ఎలా చేస్తాడని మాజీ ఎమ్మెల్యే వరద భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీరు పెడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో వ్యాపారులను, రిజిస్టర్ ఆఫీసుకు వచ్చే ప్రజలను, బంగారు కొనుగోలుకు వచ్చే వారిని పట్టుకుని పోలీసులు వేధించడం దారుణమన్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఒకవైపు చేస్తూ… ఆ ఎమ్మెల్యేనే వారిపట్ల సానుభూతి తెలపడం ఏమిటని మాజీ ఎమ్మెల్యే వరద ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి నేరుగా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి చక్కదిద్దాల్సిన ఎమ్మెల్యే ధర్నా చేయడం ఏమిటన్నారు. తనకు కావాల్సిన ఎస్ఐలను, సిఐలను, పోలీసు అధికారులను నియమించుకునే ఎమ్మెల్యే రాచమల్లు ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారి విషయంలో ఎందుకు మాట్లాడరని నిలదీశారు.
తప్పు చేసేది వాళ్లే…. సానుభూతి చూపేది వాళ్లే
71
previous post