ప్రొద్దుటూరులో సామాన్యులు బంగారు, బట్టలు కొనడానికి వస్తే పోలీసులు తనిఖీలు చేసి అధారాల్లేవని డబ్బులు సీజ్ చేయడం వెనుక ఎమ్మెల్యే రాచమల్లు ఉన్నాడని, ఆయనకు తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయని ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల కోడ్ ఇంకా అమలు కాకముందే పోలీసులు దాడుల చేస్తూ పెద్ద ఎత్తున నగదు పట్టుకుని ఐటికీ అప్పజెప్పడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఈ దాడులు చేయించేది, ఆపై సానుభూతి ప్రకటించి, ధర్నాలు చేసేది ఎమ్మెల్యేనే అంటూ ఆరోపించారు. పోలీసుల దాడుల వ్యవహారంపై ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని టిడిపి తో కలసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు రావాలని ప్రవీణ్ రెడ్డి సవాల్ విసిరారు. 30 మద్యం బాటిళ్లు పట్టుకుంటే ఎక్సైజ్ స్టేషన్ కు వెళ్ళి ఎస్ఐని నిలదీసిన ఎమ్మెల్యే 14 లక్షల నగదు కూతురు పెళ్ళి నగల కోసం తీసుకురాగా పట్టుకున్నప్పుడు ఎందుకు పోలీస్టేషన్‌కు వెళ్లలేదన్నారు. తాను నియమించుకున్న ఇబ్రహీం ఎమ్మెల్యేకి తెలియకుండా ఏదీ చేయడని విమర్శించారు.
MLA Rachamallu
వైసిపి ప్రభుత్వంలో ఆరాచక పాలన కొనసాగుతోంది, ప్రొద్దుటూరులో వ్యాపారస్తుల దగ్గరకు వచ్చిన వినియోగదారుల డబ్బులను రైడ్ చేసి పట్టుకునే విషయం స్థానిక ఎమ్మెల్యేతోపాటు, సీఎం జగన్మోహన్రెడ్డికి కూడా తెలుసునని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆరోపించారు. లోకల్ బాస్ ఆదేశాలతోనే ఇదంతా జరుగుతోందని, కూతురు పెళ్ళి కోసం బంగారం కొనేందుకు వచ్చిన వారి నుంచి డబ్బులు పట్టుకుని ఐటి అధికారులకు అప్పజెప్పడం దారుణమన్నారు. ఓ సామాన్య వ్యక్తి తన కూతురు పెళ్ళి ఎలా చేస్తాడని మాజీ ఎమ్మెల్యే వరద భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీరు పెడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో వ్యాపారులను, రిజిస్టర్ ఆఫీసుకు వచ్చే ప్రజలను, బంగారు కొనుగోలుకు వచ్చే వారిని పట్టుకుని పోలీసులు వేధించడం దారుణమన్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఒకవైపు చేస్తూ… ఆ ఎమ్మెల్యేనే వారిపట్ల సానుభూతి తెలపడం ఏమిటని మాజీ ఎమ్మెల్యే వరద ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి నేరుగా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి చక్కదిద్దాల్సిన ఎమ్మెల్యే ధర్నా చేయడం ఏమిటన్నారు. తనకు కావాల్సిన ఎస్ఐలను, సిఐలను, పోలీసు అధికారులను నియమించుకునే ఎమ్మెల్యే రాచమల్లు ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారి విషయంలో ఎందుకు మాట్లాడరని నిలదీశారు.





Total views : 78685