70
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామ శివారులో గల చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద గంజాయి అమ్ముతున్నటువంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గురజాల సబ్ ఇన్స్పెక్టర్ జయరామ్. ఈ దాడుల్లో మూడు కిలోల గంజాయిని సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి, గురజాల మెజిస్ట్రేట్ ముందు నిందితుడును హాజరుపరిచారు. గంజాయి తయారు చేయడం , అమ్మడం నేరమని, అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గురజాల సెబ్ si జయరామ్ తెలిపారు.