నేడు జగనన్న విదేశీ విద్యాదీవెన నిధులు విడుదల

Educational blessing

Advertisements

&NewLine;<p>జగనన్న విదేశీ విద్యాదీవెన&comma; సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహక నిధులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు&period; అర్హులైన 390 మంది విద్యార్థులకు 41&period;59 కోట్ల రూపాయలను సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి జమచేశారు&period; ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ చదువుకునేందుకు పేద విద్యార్ధులు ఇబ్బంది పడకూడదని అన్నారు&period; పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడొద్దని తెలిపారు&period; పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని అన్నారు&period; విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్ధుల కల నెరవేర్చడమే లక్ష్యమని పేర్కొన్నారు&period; పేద&comma; మధ్యతరగతి&comma; వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల తలరాత మార్చేందుకే విదేశీ విద్యా దీవెన పథకమని సీఎం జగన్‌ పేర్కొన్నారు&period; విదేశీ విద్యాదీవెన కింద రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులు విదేశాల్లో టాప్‌ యూనివర్సిటీలో చదువుతున్నారని&comma; వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు&period; అలాగే ప్రిలిమ్స్‌ పాసైతే లక్ష&comma; మెయిన్స్‌కు క్వాలిఫై అయితే లక్షన్నర ఇస్తున్నామని తెలిపారు&period; రూ&period; 8 లక్షల వార్షికాదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందుతుందని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..