89
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విషాదం చోటుచేసుకుంది. సున్నం బట్టి వీధిలో నూతనంగా నిర్మిస్తున్న ఓ ఇంటి పైకి వెళ్ళిన రోషన్ కు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు. మృతుడు వంట మాస్టర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. అయితే రోషన్ ఎక్కువగా మద్యం సేవిస్తూ ఉంటాడని ఇప్పుడు కూడా మద్యం మత్తులో ఇంటి పైకి వెళ్ళిన రోషన్ కాలు జారీ విద్యుత్ తీగలు మీద పడటంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ గురై మృతి చెందాడని స్థానికులు తెలిపారు. అయితే మృతుడు రోషన్ మెడ పై పెద్ద గాయం ఉండటంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.