Monday, April 20, 2026
News Navigation
Monday, April 20, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Andhra Pradesh ‘ రాజధాని ఫైల్స్’ సినిమా విడుదలకు.. ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

‘ రాజధాని ఫైల్స్’ సినిమా విడుదలకు.. ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

by Satya
Rajadhani Files

రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ సర్టిఫికెట్లతో పాటు అన్ని రికార్డులు సక్రమంగానే ఉన్నాయని పేర్కొంటూ సినిమాను విడుదల చేసుకోవచ్చని పేర్కొంది. గురువారం ఈ సినిమా విడుదలపై విధించిన స్టేను ఎత్తివేసింది. దీంతో సినిమా విడుదలకు నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏపీ సీఎం జగన్ తో పాటు ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ రాజధాని ఫైల్స్ సినిమా విడుదలను అడ్డుకోవాలని వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. గురువారం సినిమా విడుదలపై స్టే విధించింది. సినిమాకు సంబంధించిన పూర్తి రికార్డులను అందజేయాలని నిర్మాతలను ఆదేశించింది.

ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ :

శుక్రవారం విచారణ జరగగా.. ఏపీ ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమాపై స్టే కొనసాగించాలని పిటిషనర్ తరఫున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. నిర్మాతల తరపు న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ… రివిజన్ కమిటీ సూచనల మేరకు పలు సన్నివేశాలను తొలగించినట్లు చెప్పారు. ఆ తర్వాతే తమకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిందన్నారు. డిసెంబర్ లో తమకు సెన్సార్ సర్టిఫికెట్ వస్తే… వైసీపీ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించిందని చెప్పారు. ఈ క్రమంలో సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్‌లు, రికార్డ్‌లను పరిశీలించిన కోర్టు.. అన్నీ సక్రమంగానే ఉన్నాయని పేర్కొంటూ సినిమాను విడుదల చేసుకోవచ్చని అనుమతినిచ్చింది. Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • కందుకూరు వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములపై పొలిటికల్‌ రచ్చ
    ప్రభుత్వ భూముు ఎక్కడున్నా.. కబ్జాదారుల కళ్లు వాలిపోతున్నాయి. నయాన్నో, భయాన్నో వాటిని కాజేసేందుకు కుట్రలు మొదలవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడిలో ఇలాగే దేవాలయ భూములపై రాజకీయ నేతల కన్ను పడింది. లీజు రూపంలో వాటిని కబళించేందుకు యత్నాలు ప్రారంభమయ్యాయి.…
  • అమరావతి అమ్మను తలపిస్తోన్న అన్న క్యాంటీన్ల సేవలు..
    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సతీమణి నారా భువనేశ్వరి తన ఉదారతను చాటుకున్నారు. రాష్ట్రంలో పేదల ఆకలి తీరుస్తున్న ‘అన్న క్యాంటీన్ల’ నిర్వహణ కోసం ఆమె ఏకంగా 76 లక్షల భారీ విరాళాన్ని అందజేశారు. ఈ…
  • నేడు మధ్యాహ్నం కోయంబత్తూరుకు సీఎం చంద్రబాబు..
    సీఎం చంద్రబాబు తమిళనాడు ఎన్నికల క్షేత్రంలో అడుగుపెడుతున్నారు. నేడు మధ్యాహ్నం అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన కోయంబత్తూరుకు బయలుదేరుతారు. అక్కడ నుంచి ఆయన రెండు రోజుల బిజీ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ముఖ్యంగా తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాలపై…

Advertisements

You may also like

Our Visitor

006950
Total views : 46164

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.