ఎన్నిలకు కేవలం రెండు వారాలు ఉండడంతో బీజేపీ(BJP) హైకమాండ్ తెలంగాణ(Telangana)పై దృష్టి పెట్టింది. వారానికి ఎలాగ లేదన్నా మూడు లేదా నాలుగు సభలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 25న కేంద్ర మంత్రి అమిత్ షా(Amit Shah) తెలంగాణకు రానున్నారు. సిద్దిపేట(Siddipet)లో జరగనున్న భారీ బహిరంగ సభకు అమిత్ షా హాజరుకానున్నారు. మెదక్ నుంచి ఆ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు(Raghunandan Rao) బరిలో ఉన్నారు.
ఇది చదవండి: ఉమ్మడి పాలమూరు జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన..
ఈ సభ తర్వాత చెవెళ్ల, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌లో భారీగా సభలకు ప్లాన్ చేస్తోంది. అయితే వేరే రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఉండడంతో తేదీల ప్రకటన కాస్త ఆలస్యమైందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వారంలో మిగతా సభలకు సంబంధించి షెడ్యూల్ వెల్లడయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.