అయోధ్య పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

Ayodhya

Advertisements

&NewLine;<p>అయోధ్య రామమందిరానికి భక్తుల తాకిడి ఉద్ధృతస్థాయిలో కొనసాగుతోంది&period; మొదటి రోజు అంచనాలకు మించి రామభక్తులు ఆలయానికి పోటెత్తారు&period; అక్కడక్కడా చిన్నపాటి తోపులాటలు&comma; తొక్కిసలాటలు జరిగాయి&period; ఎవరికీ ఎలాంటి హానీ జరగకపోయినప్పటికీ ఆలయంలో మోహరించిన సెక్యూరిటీ సిబ్బందికి కూడా అక్కడి పరిస్థితులు సవాలుగా మారాయి&period; దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది&period; అయోధ్యకు వెళ్లే వాహనాలను అధికారులు అడ్డుకుంటున్నారు&period; భక్తుల రద్దీ దృష్ట్యా అయోధ్యకు వచ్చే అన్ని వాహనాలను మరికొన్ని రోజులపాటు నిలిపివేయాలని నిర్ణయించారు&period; ప్రాణప్రతిష్ఠ జరిగిన తరువాతి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు&period; దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి&period; భద్రతా ఏర్పాట్లు సవాలుగా మారాయి&period; దీంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని సమీక్షించారు&period; ప్రత్యక్ష ప్రసారం ద్వారా అక్కడి పరిస్థితులు తెలుసుకున్నారు&period; రద్దీని గమనించిన ఆయన అయోధ్య వచ్చే యాత్రికుల రాకపోకలను నియంత్రించాలని నిర్ణయించారు&period; ఈ మేరకు అధికారులకు కీలక సూచనలు చేశారు&period; దీంతో రానున్న కొన్ని రోజులపాటు అయోధ్యకు వెళ్లే అన్ని వాహనాలపై నిషేధం విధించాలని అధికారులు నిర్ణయించారు&period; వాహనాలకు సంబంధించి అన్ని ఆన్‌లైన్ బుకింగ్‌లను రద్దు చేశారు&period; ఇందుకు సంబంధించిన బుకింగ్ ఛార్జీలను రీఫండ్‌ చేస్తామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..