మాది మైలవరం నియోజకవర్గమేనని, మా నాయనమ్మ గారిది ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడు గ్రామమని మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు స్పష్టం చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసి, ఐటీడీపీ సత్తాను చాటాలన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఐటీడీపీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసమర్థ, అపసవ్య విధానాల వల్ల ఈ ప్రాంత ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారో సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ముఖ్యంగా అమరావతి రాజధానిపై కక్ష్య కట్టి అభివృద్ధిని విస్మరించి రాష్ట్రప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేసి వ్యవసాయ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వారందరికీ ఉపాధి లేకుండా చేశారన్నారు. కులాల మధ్యన చిచ్చు పెడుతూ రానున్న ఎన్నికల్లో లబ్ది పొందటానికి వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు. దీన్ని ఐటీడీపీ సభ్యులందరూ తిప్పికొట్టాలన్నారు.
మాది మైలవరం నియోజకవర్గమే…
81
previous post