మాది మైలవరం నియోజకవర్గమేనని, మా నాయనమ్మ గారిది ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడు గ్రామమని మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు స్పష్టం చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసి, ఐటీడీపీ సత్తాను చాటాలన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఐటీడీపీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసమర్థ, అపసవ్య విధానాల వల్ల ఈ ప్రాంత ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారో సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ముఖ్యంగా అమరావతి రాజధానిపై కక్ష్య కట్టి అభివృద్ధిని విస్మరించి రాష్ట్రప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేసి వ్యవసాయ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వారందరికీ ఉపాధి లేకుండా చేశారన్నారు. కులాల మధ్యన చిచ్చు పెడుతూ రానున్న ఎన్నికల్లో లబ్ది పొందటానికి వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు. దీన్ని ఐటీడీపీ సభ్యులందరూ తిప్పికొట్టాలన్నారు.
TDP office
టిడిపి కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు :
నాపై నమ్మకంతో తెలుగుదేశం – బిజెపి – జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు నారా చంద్రబాబు నాయుడు కి, నారా లోకేష్ కి, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చంనాయుడు కి కృతజ్ఞతలు. రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో కందుకూరు ఎమ్మెల్యేగా గెలుపొంది పార్టీకి గిఫ్ట్ గా అందిస్తాను. వైసిపి పరిపాలనతో ప్రజలు ఇప్పటికే విసుగు చెందారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కేవలం చంద్రబాబు నాయుడు వల్ల మాత్రమే అని నమ్మి ఈసారి టిడిపికి పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోబోతున్నాడు. కందుకూరులో పాతికేళ్ల తర్వాత భారీ విజయం సాధించబోతున్నాం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కందుకూరు నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే నా మొదటి లక్ష్యం. అలాగే రాళ్లపాడు రిజర్వాయర్ రైతులకు సాగునీరు సకాలంలో అందించడం, రామాయపట్నం పోర్టు నిర్వాసితులకు న్యాయం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెడతాను. కందుకూరును రోల్ మోడల్ గా తీర్చిదిద్దేలా, ప్రజలందరూ మెచ్చేలా పరిపాలన చేస్తానని మాట ఇస్తున్నా. కందుకూరుకు కొత్తగా వచ్చిన ఒక వ్యక్తి శాంతిభద్రతల గురించి ఏవేవో మాట్లాడుతున్నారు. అలాంటి తప్పుడు ప్రచారాలు మానుకుంటే మంచిది. కందుకూరులో శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బంది రానివ్వను. ఆ విషయంలో గ్యారెంటీ నాది.
నాకు ఇన్చార్జ్ పదవి రావడంలో, తాజాగా అభ్యర్థి ప్రకటన విషయంలోనూ సహాయ సహకారాలు అందించిన డాక్టర్ దివి శివరాం కి ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో శాసనసభ్యులుగా పనిచేసిన శివరాం , పోతుల రామారావు , ఇతర సీనియర్ నాయకుల సలహాలతో ముందుకు వెళతా. టికెట్ కోసం పోటీపడ్డ నా సోదరుడు ఇంటూరి రాజేష్ తో కూడా మాట్లాడతాను. రాజేష్ కూడా పార్టీ కోసమే కష్టపడుతున్నాడు. ఇద్దరం కలిసి త్వరలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాం. ఈరోజు కందుకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
టిడిపి కార్యాలయం (TDP office ) :
మార్కాపురంలో ఉన్న టిడిపి కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఎన్నికల కోసం హడావుడిగా పూర్తికాని వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తానని అమాయక ప్రజలను మోసం చేస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి నాటకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మార్కాపురం టిడిపి ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కందుల నారాయణరెడ్డి వైసీపీ ప్రభుత్వం పై జగన్మోహన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
పరిపాలన చేసిన ఐదు సంవత్సరాల కాలంలో పశ్చిమ ప్రాంతానికి ఏమి వరగదీసారని ఈ ప్రాంతానికి వస్తున్నారని ప్రశ్నించారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కాలువలను పూర్తి చేయకుండా, నిర్వాసితుల కాలనీలలో వసతులు కల్పించకుండా ఏ విధంగా ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారని ప్రశ్నించారు. మీరు చేస్తున్న మోసాలను ప్రజలను మభ్యపెడుతున్న వాగ్దానాలను రానున్న రోజుల్లో ప్రజలకు అర్థమయ్యే విధంగా తీసుకువెళ్లి వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడతామని ఆయన సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 54434