Vijaya Sankalpa Yatra :
బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర లో భాగంగా ఆదివారం రామగిరి మండలం సెంటినరీ కాలనీ సాయిరాం గార్డెన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా అణగారిన వర్గాలకు లబ్ది చేకూరాలేదని, అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అందరికీ రిజర్వేషన్లు కల్పించాలని ప్రయత్నం చేసినా, కాంగ్రెస్ పార్టీ వల్ల చర్చల వరకే పరిమితమయ్యేదని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ వల్లే భారత దేశంలో ఏ ప్రభుత్వాలు చేయలేని రిజర్వేషన్లు జమ్ము కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తో అమలు జరగడం, G 20 సర్వ సభ్య దేశాలలో భారత దేశం స్థానం దక్కిందని, దానికి గర్వపడుతున్నానని ధీమా వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు తెలియని ఇలాంటి విషయాలు జనంలోకి తీసుకెళ్ళి తిరిగి బిజేపి కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, స్థానిక బిజేపి నేతలు పాల్గొన్నారు.