110
టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనన పార్టీ 24 అసెంబ్లీ సీట్లు, 3 లోక్ సభ స్థానాలకు అంగీకరించడం పట్ల పవన్ కల్యాణ్ నిన్న తాడేపల్లిగూడెం సభలో సొంత క్యాడర్ కు వివరించే ప్రయత్నం చేశారు. మనకు పోల్ మేనేజ్ మెంట్ ఉందా? టీడీపీలాగా మనకు సంస్థాగత బలం ఉందా? జగన్ లా మన వద్ద వేల కోట్లు ఉన్నాయా? బూత్ లెవల్లో మనకు కార్యకర్తలున్నారా? ఇవన్నీ ఆలోచించే 24 సీట్లకు ఒప్పుకున్నానని పవన్ వెల్లడించారు.
ఈ క్రమంలో సీఎం జగన్ ను అథఃపాతాళానికి తొక్కేస్తానంటూ ప్రతిన బూనారు. దీనిపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. జగన్ ఏమీ ఆషామాషీగా ముఖ్యమంత్రి కాలేదని స్పష్టం చేశారు. తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు… ఊరికే అయిపోలేదుగా! అని వ్యాఖ్యానించారు.