చిలకలూరిపేట పట్టణంలోని బ్యాంక్ కాలనీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయంలో చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మల్లెల రాజేష్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నికలలో ఎవరూ ఊహించని విధంగా ఒక చరిత్ర సృష్టించి అధికారంలోకి వచ్చామన్నారు. మరలా 2024 ఎన్నికలలో అదేవిధంగా అధికారంలోకి రావడానికి మన జగనన్న పాలన చేస్తున్నారన్నారు. నరసరావుపేట పార్లమెంటు ఏర్పడినప్పటి నుండి ఇంతవరకు ఏపార్టి చెయ్యని విధంగా ఒక బీసీ అభ్యర్థి ని ప్రకటించిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. అనీల్ కుమార్ యాదవ్ కి టిక్కెట్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలంతా అనీల్ కుమార్ యాదవ్ కి మద్దతుగా ఉండి భారీ మెజారిటీతో గెలిపిస్తామని మల్లెల రాజేష్ నాయుడు తెలిపారు.
ఎవరూ ఊహించని చరిత్ర సృష్టించాం..
75
previous post