ఆర్గానిక్ హబ్ (organic hub):
తంబళ్ళపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు రోజురోజుకీ మారుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఆశావహుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రముఖ పారిశ్రామికవేత్త ఎన్నారై కొండా నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ వచ్చే 2024 ఎలక్షన్లలో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా టికెట్ను సంపాదించి తంబళ్ళపల్లి నియోజకవర్గం అభివృద్ధి కి కృషి చేస్తానని ఆశా భావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మన నియోజకవర్గంలో బయట వ్యక్తులు అందరూ నియంతలాగా పరిపాలన చేస్తున్నారని వీరి నుంచి తంబళ్ళపల్లె ప్రజలు బయటపడాలంటే స్థానికులకు అవకాశం కల్పించాలని మన ప్రాంత అభివృద్ధిని మనమే చేసుకోవాలని అని పిలుపునిచ్చారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
పి.టి.ఎం మండలంలోని మడుమూరు సమీపంలోనీ 150 ఎకరాల్లో కొండా ఫామ్స్, రుక్విన ఫాన్స్ ద్వారా రైతులకు అధునాతన వ్యవసాయంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వీటి ద్వారా ప్రతి నెల 50 మంది రైతులను పూర్తిస్థాయిలో శిక్షణ కల్పించి ఇజ్రాయిల్ కు పంపించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇక్కడ నుండి వెళ్లిన రైతులకు ప్రతినెల 1,20,000 జీతం వస్తుందని తెలిపారు. ఈసారి తంబళ్లపల్లి నియోజకవర్గంలో నాకు అవకాశం కల్పిస్తే మంచి మెజారిటీతో గెలిచి నియోజకవర్గంలో ఆర్గానిక్ హబ్, అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ ను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించడమే నా లక్ష్యం అంటూ కొండా నరేంద్ర మీడియా సమావేశంలో తెలిపారు. Read Also..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.