అండగా ఉంటాం.. గెలిపించుకుంటాం…

Inturi Nageswara Rao in the guarantee program for the future of Babu Surety

Advertisements

&NewLine;<p>కందుకూరు పట్టణంలోని 6వ వార్డు కోటకట్ట మసీదు ప్రాంతంలో&comma; బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం ఉదయం నిర్వహించారు&period; ముందుగా ఆ ప్రాంతంలోని ముస్లింలంతా&comma; పెద్దఎత్తున తరలివచ్చి నాగేశ్వరరావు కి ఘనస్వాగతం పలికారు&period; నాగేశ్వరరావు పై పూలు చల్లుతూ అభిమానంతో ముంచేత్తారు&period; గతంలో ఎప్పుడూ గడపదాటని ముస్లిం మహిళలు కూడా నాగేశ్వరరావు ని ప్రతి ఇంటికి తీసుకువెళ్లి&comma; ఆయనను అందరికీ పరిచయం చేస్తూ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం&period; ఈ సందర్భంగా మహిళలంతా జగన్ ప్రభుత్వంపై&comma; స్థానిక వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు&period; కొంతమంది అధికార పార్టీ నేతలు తమకు ప్రభుత్వ పథకాలు అందకుండా అడ్డుపడుతున్నారని&comma; నోరు తెరిచి అడిగితే బెదిరిస్తున్నారని నాగేశ్వరరావుతో చెప్పారు&period; మేమంతా గతంలో వైసీపీకి ఓట్లు వేశాం&period; ఈ ప్రభుత్వం మాకేమీ చేయలేదు&period; సైడు కాలవలు శిధిలమై నీళ్ళు ముందుకు పోక కంపు&comma; దోమలతో అల్లాడిపోతున్నాం&period; కనీసం అవి బాగు చేయడానికి కూడా వైసిపి నాయకులకు చేతకావడం లేదు&period; ఎన్నికలకు ముందేమో పట్టాలిచ్చి ఇల్లు కట్టిస్తాం అని చెప్పారు&period; ఓట్లు వేయించుకున్న తర్వాత&comma; తక్కువమందికి పట్టాలిచ్చి&comma; ఇల్లు మీరే కట్టుకోవాలని చెబుతున్నారు&period; ఇల్లు కట్టుకోకపోతే పట్టాలు తిరిగి ఇచ్చేయాలని బెదిరిస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమానికి వెళ్ళకూడదంటూ మూడు రోజులుగా తమపై వైసీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని మహిళలు తెలిపారు&period; ఒకవేళ కార్యక్రమానికి వెళితే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని ఉదయం కూడా తమను బెదిరించారని చెప్పారు&period; ఈసారి వైసీపీకి ఓటు వేసే ప్రసక్తే లేదని&comma; ఇంటూరి నాగేశ్వరరావుకి మద్దతుగా నిలిచి&comma; ఆయన్ను అధిక మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు&period; నాగేశ్వరరావు మాట్లాడుతూ&comma; రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో పేదలందరికీ స్థలాలు కేటాయించి&comma; ఇల్లు కట్టించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు&period; అలాగే అర్హులందరికీ అభివృద్ధి&comma; సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు&period; మీకు ఎలాంటి బెదిరింపులు వచ్చినా తమకు తెలియజేయాలని&comma; తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు&period; రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను గమనించి&comma; రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని నాగేశ్వరరావు కోరారు&period; కందుకూరులో అందరికీ ఆమోగ్యమైన పరిపాలన రావాలంటే వైసీపీని ఓడించాలన్నారు&period; రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు&comma; వార్డు అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ బాషా&comma; వార్డు నాయకులు షేక్ ఫిరోజ్&comma; షేక్ మున్నా&comma; షేక్ మియాజాన్&comma; షేక్ దావూద్ బాషా&comma; షేక్ నాయబ్ రసూల్&comma; సయ్యద్ అహ్మద్&comma; షేక్ రియాజ్&comma; షేక్ సలీం&comma; షేక్ అబ్దుల్లా&comma; షేక్ సంధాని&comma; షేక్ జిలాని&comma; షేక్ సుభాని&comma; షేక్ నిషాహీద్ నాయకులు కండ్రా మాల్యాద్రి&comma; చదలవాడ కొండయ్య&comma; చిలకపాటి మధుబాబు&comma; షేక్ రఫీ&comma; వడ్డెళ్ల రవిచంద్ర&comma; బెజవాడ ప్రసాద్&comma; గోచిపాతల మోషే&comma; రాయపాటి శ్రీనివాసరావు&comma; రెబ్బవరపు మాల్యాద్రి&comma; పొడపాటి మహేష్&comma; చుండూరి శీను&comma; షేక్ సలాం&comma; సయ్యద్ జియావుద్దీన్&comma; రూబీ&comma; గౌస్ బాషా&comma; కరిముల్లా&comma; షేక్ ఖలీల్&comma; సవిడిబోయిన వెంకటకృష్ణ&comma; ముచ్చు వేణు పులి నాగరాజు&comma; ఫాజిల్&comma; చంటి&comma; బద్దిపూడి శిఖామణి&comma; మమ్ముషా&comma; వేముల ప్రసాద్&comma; ముప్పవరపు వేణు గుమ్మ శివ&comma; మచ్చ మనోహర్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్