65
జగిత్యాల జిల్లా సారంగాపూర్ లో పర్యటించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలలో గెలుపు ఓటములు నాకు సహజమని ప్రజలు నాకు ఏ బాధ్యతలు అప్పగించిన ఆ హోదాలో నా బాధ్యతలు నిర్వర్తిస్తానని అన్నారు. నేను ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే, పెద్ద స్థాయిలో బాధ్యతలు వచ్చి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకపోవచ్చని జగిత్యాల నియోజకవర్గానికి అను నిత్యం, అందుబాటులో ఉండి, నా సేవలు అవసరమైన వాళ్ళకి అందించడానికే దేవుడు నన్ను నియోజకవర్గానికి పరిమితం చేసాడని, ఆ విషయంలో నేను ఎంతో సంతోషిస్తున్నానని అన్నారు. ప్రభుత్వం లో నేను అంటే గౌరవం ఉందని, నా మాట ఎవరు కాదనరని ఎమ్మెల్యే గా గెలుస్తే జగిత్యాల నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేస్తానో, అంతకు రెట్టింపు అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు.