యేవమ్ లోగో (Yevam Logo):
కలర్ ఫోటో, గామి చిత్రాల ఫేమ్ చాందినీ చౌదరి, కేజీఫ్ & నారప్ప ఫేమ్ వశిష్ట, నూతన నటుడు భరత్ రాజ్, బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి ముఖ్యపాత్రలలో, ప్రకాష్ దంతులూరి దర్శత్వంలో, నవదీప్ – పవన్ గోపరాజు స్థాపించిన C-Space నిర్మాణంలో రూపొందించబడిన “యేవమ్” సినీమా ప్రమోషన్స్ ఫిబ్రవరి 25 నుండి మొదలయ్యాయి. ప్రసిద్ధ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలై చేత ప్రత్యేకంగా చేయించిన టైటిల్ లోగో సినీతారల ద్వారా కాకుండా చిత్రకారుడి చేత ఆవిష్కరించబడటం ఒక వినూత్న ప్రయత్నం. మన ఇన్స్టా యూజర్స్ కూడా దీన్ని లైక్ చేసి షేర్ చేస్తూ సక్సెస్ చేస్తున్నారు. ఈ చిత్రం ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అని, చాందినీ నటన హైలైట్ అని చిత్రకారులు చెప్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం నీలేష్ మండాలపు మరియు కీర్తన శేష్, సినిమాటోగ్రఫర్ గా విశ్వేశ్వర్ SV, ఎడిటర్ గా సృజన అడుసుమిల్లి, ప్రొడక్షన్ డిజైనర్ గా లక్ష్మణ్ ఏలై గారు పని చేశారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇది చదవండి: ‘లవ్ మీ’ కథ వినగానే ఫుల్ ఎగ్జైట్ అయ్యాను
మరిన్ని ఫిల్మ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్చేయండి.