Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Film ‘లవ్ మీ’ కథ వినగానే ఫుల్ ఎగ్జైట్ అయ్యాను: టైటిల్ లాంచ్ ఈవెంట్‌లో హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు

‘లవ్ మీ’ కథ వినగానే ఫుల్ ఎగ్జైట్ అయ్యాను: టైటిల్ లాంచ్ ఈవెంట్‌లో హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు

by Rama
Love Me

‘లవ్ మీ (Love Me)’ మూవీ టైటిల్ లాంచ్:

యంగ్ హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య నటించిన చిత్రాన్నిశిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ప్రకటన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సినిమాకు ‘లవ్ మీ (Love Me)’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ‘ఇఫ్ యూ డేర్ (If You Dare)’ అనేది ఉప శీర్షిక. టైటిల్ ప్రకటించిన అనంతరం చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించారు.

హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘ఆశిష్ ప్రస్తుతం తిరుమలలో ఉన్నారు. అందుకే అతను ఇక్కడకు రాలేకపోయారు. లవ్ మీ ఇఫ్ యూ డేర్ (Love me If you dare) అనేది మొదలవ్వడానికి నాగ, అరుణ్ కారణం. నాగ నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఓ స్క్రిప్ట్ వినండి.. నా ఫ్రెండ్‌తో కలిసి చేశామని అన్నాడు. అప్పుడు అరుణ్‌తో నాకు పరిచయం ఏర్పడింది. ఆ స్క్రిప్ట్ విన్న క్షణమే ఓ ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లా. ఆర్య కథ విన్నప్పుడు ఎలా ఎగ్జైట్ అయ్యానో.. మళ్లీ అలా ఎగ్జైట్ అయ్యాను. ఇదొక న్యూ ఏజ్ ఫిల్మ్. ఆశిష్ హీరోగా కావాలని అడిగారు. అలానే హర్షిత్, హన్షిత్‌ను ఇవ్వండని నాగ అడిగారు. కథ చెప్పి నన్ను గెలిచారు. కొత్త వాళ్లతో ‘బలగం’ తీశాం. కొత్త వాళ్లని ఎంకరేజ్ చేయాలని దిల్ రాజు ప్రొడక్షన్స్ పెట్టాం. ఈ కథను చాలా మందికి చెప్పాం. అందరూ ఎగ్జైట్ అయ్యారు. స్క్రిప్ట్ పూర్తయ్యాక.. టెక్నీషియన్స్ పేర్లు చెబితే భయం వేసింది. పీసీ శ్రీరామ్ గారికి స్క్రిప్ట్ వినమని చెప్పాను.

Follow us on : Facebook, Instagram & YouTube.

ఆయన స్క్రిప్ట్ చదివి వెంటనే ఓకే చెప్పారు. మ్యూజిక్ విషయంలో కీరవాణి కావాలన్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటివి చేస్తున్నారు.. ఆయన మీకు దొరుకుతాడా? అని అన్నారు. కీరవాణి గారిని అప్రోచ్ అయి స్క్రిప్ట్ వినిపించారు. ఆయన కూడా స్క్రిప్ట్ విని వెంటనే ఓకే చెప్పారు. హీరోయిన్ కోసం వెతుకుతున్న టైంలో బేబీ పెద్ద హిట్ అయింది. ఆఫీస్‌కు వచ్చి స్క్రిప్ట్ పూర్తిగా చదివి ఫుల్ ఎగ్జైట్ అయింది. ఇలా ఓ స్క్రిప్ట్ ఈ రేంజ్‌లో ఎగ్జైట్ చేయించడం చాలా అరుదుగా చూస్తాం. ఇక సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టుకుంటుందని నాకు నమ్మకంగా ఉంది. ఫిబ్రవరి 27న టైటిల్ ప్రకటించారు. ఏప్రిల్ 27న సినిమాను రిలీజ్ చేయబోతోన్నాం. బలగం తరువాత హర్షిత్, హన్షితలు వేరే ప్రాజెక్ట్ చేయాల్సింది ఈ సినిమా వచ్చింది. ఆశిష్ కూడా వేరే ప్రాజెక్ట్ చేయాల్సింది.. ఈ ప్రాజెక్ట్ రెడీ అయింది. నాకు ఆర్య విషయంలో ఏం జరిగిందో.. మీ అందరికీ అదే జరగబోతోందనే వైబ్స్ వస్తున్నాయి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. ‘ ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’ కథ విన్నప్పటి నుంచి ఇప్పటికీ నాకు ఆ వైబ్స్ వస్తుంటాయి. అదే ఎగ్జైట్మెంట్ ఇప్పటికీ ఉంది. ఈ మూవీ నాకు చాలా ప్రత్యేకం. ఇలాంటి పాయింట్, లైన్‌ను ఇది వరకెప్పుడూ చూడలేదు. త్వరలోనే టీజర్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. టీజర్ అందరికీ డిఫరెంట్ వైబ్‌ను కలిగిస్తుంది. థియేటర్లోంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌తో వస్తారు’ అని అన్నారు.

నటీనటులు : ఆశిష్, వైష్ణవి చైతన్య తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : దిల్ రాజు ప్రొడక్షన్స్
నిర్మాతలు : హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి
దర్శకుడు : అరుణ్ భీమవరపు
కెమెరామెన్ : పీసీ శ్రీరామ్
సంగీతం : కీరవాణి
ఎడిటర్ : సంతోష్ కామిరెడ్డి
పీఆర్.ఒ : వంశీ కాకా

ఇది చదవండి: ‘భవానీ వార్డ్’ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌..


పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన "ఎస్ ఆర్ కళ్యాణమండపం" డైరెక్టర్ శ్రీధర్ గాదె, శ్రీ ఐశ్వర్య …
“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.
"15 ఏళ్ల నా కల నెరవేరింది.. నా బిడ్డలా చూసుకున్నా.." 'పంచనామా' ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్ …
హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.
హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై …

మరిన్ని ఫిల్మ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: