Friday, October 16, 2026
News Navigation
Friday, October 16, 2026
News Navigation

Breaking

Friday, October 16, 2026
Home Film ‘వృషకర్మ’ 2026 డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్.

‘వృషకర్మ’ 2026 డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్.

by CVR NEWS

యువ సామ్రాట్ నాగ చైతన్య, కార్తీక్ దండు, ఎస్‌విసిసి & సుకుమార్ రైటింగ్స్ మైథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ 2026 డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

యువ సామ్రాట్ నాగ చైతన్య, విజనరీ ఫిల్మ్ మేకర్ కార్తీక్ దండు మోస్ట్ ఎవైటెడ్ మైథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. ఎస్‌విసిసి, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మునుపెన్నడూ చూడని సినిమాటిక్ అనుభవాన్ని అందించబోతోంది. బాపినీడు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలను ఎవరూ టచ్ చేయని ఒక సరికొత్త నేపథ్యంలో ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

తాజాగా ‘వృషకర్మ’ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా డిసెంబర్ 4, 2026న థియేటర్లలో విడుదల కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది పర్ఫెక్ట్ రిలీజ్ టైమ్. సినిమాను ప్రమోట్ చేసేందుకు మేకర్స్‌కు తగినంత సమయం ఉంటుంది. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది.

కార్తిక్ దండు డిఫరెంట్ విజన్‌తో పాటు ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ క్రియేటివ్ ఫోర్సెస్ ‘వృషకర్మ’ కోసం కలిసి పనిచేస్తున్నాయి. ఇప్పటికే సినిమా స్ట్రైకింగ్ గ్లింప్స్, బిహైండ్ ది సీన్స్ వీడియోలు విడుదలై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని పెంచాయి. ఈ వీడియోలు సినిమా యూనిక్ వరల్డ్, స్కేల్, విజువల్ గ్రాండియర్‌కు సంబంధించిన ఓ అద్భుతమైన లుక్ ను అందించాయి.

వైవిధ్యమైన, ఛాలెంజింగ్ సబ్జెక్టుల తో వస్తున్న నాగచైతన్య ‘వృషకర్మ’లో డిఫరెంట్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ఆయన మ్యాసీవ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అయ్యారు. ఇప్పటికే తనకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే గ్లింప్స్‌లో స్పర్శ్ శ్రీవాస్తవ తన స్ట్రైకింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. దీంతో ఆయన పాత్రపై మరింత ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. రిలీజ్ డేట్ అధికారికంగా లాక్ కావడంతో మేకర్స్ భారీ ప్రమోషనల్ క్యాంపెయిన్‌కు సిద్ధమవుతున్నారు. దేశవ్యాప్తంగా సినిమాను ప్రమోట్ చేయడంతో పాటు ఓవర్సీస్ మార్కెట్లలోనూ అగ్రెసివ్ ప్రమోషన్స్ నిర్వహించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది.

‘వృషకర్మ’ కోసం స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. రాగుల్ డి హెరియన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అజనీష్ బి లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తూ సినిమా కోసం ప్రత్యేకమైన ప్రపంచాన్ని రూపొందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: