Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Film ‘కాగితం పడవలు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ ఎంజీఆర్ తుకారాం.

‘కాగితం పడవలు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ ఎంజీఆర్ తుకారాం.

by CVR NEWS

‘కాగితం పడవలు’ క్లైమాక్స్ చూసి షాక్ అవుతారు. సినిమా కచ్చితంగా ఆడియన్స్ సర్ప్రైజ్ చేస్తుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ ఎంజీఆర్ తుకారాం

వర్ధన్, కృష్ణప్రియ హీరో హీరోయిన్లుగా ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ ‘కాగితం పడవలు’. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, T. R. ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. సెప్టెంబర్ 18న ఈ చిత్రం ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో వర్ధన్ మాట్లాడుతూ .. అందరికీ నమస్కారం. ట్రైలర్ మీ అందరికీ నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా కష్టపడి చేశాం. మీరందరూ ఇష్టపడి చూస్తారని నమ్ముతున్నాము. అందరూ సినిమాని కష్టపడే చేస్తారు. కాకపోతే ఈ సినిమాకి నిజంగానే మేము కష్టపడ్డామని చెప్పాలి. ఈ సినిమా జర్నీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నిజానికి ‘కాగితం పడవలు’ అనే సినిమాలో మేము ఒక బీటెక్ చేసినట్టుగా చేశాం, మీరందరూ మమ్మల్ని పాస్ చేస్తారని కోరుకుంటున్నాను. సినిమా చూడండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.

డైరెక్టర్ తుకారాం మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ప్రయత్నం చేసి ఓడిపోయిన వాడు ఎవరూ చరిత్రలో లేడు. ఈరోజు అదే ప్రయత్నం మీ ముందు నిలబడింది. సెప్టెంబర్ 18న ఫలితాన్ని ఇస్తుంది. మన కష్టం విలువ మనకే తెలుస్తుంది. ఈ టీమ్ మెంబర్స్ అందరూ నాతో పాటు నిలబడ్డారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా కంటెంట్ అంతా చూడండి. మీకు నచ్చితేనే టికెట్ తీసుకుని థియేటర్‌కి రండి. మిమ్మల్ని ఎవరినీ కూడా నేను డిసప్పాయింట్ చేయను. ఈ సినిమా క్లైమాక్స్ చూసి మీరందరూ షాక్ అవుతారు. కచ్చితంగా మీరు సర్‌ప్రైజ్ అవుతారు.

హీరోయిన్ కృష్ణప్రియ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 18న థియేటర్‌లో రిలీజ్ అవుతుంది. చాలా మంచి సినిమా ఇది. ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. ముందుగా మా డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. చాలా అద్భుతం కథ పాత్ర ఇచ్చారు. అందరూ ఈ సినిమాని థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి.

నిర్మాత అంజనప్ప మాట్లాడుతూ: ముందుగా మా నిర్మాతలు అందరికీ థాంక్యూ. డైరెక్టర్ చాల కష్టపడ్డారు. ఈ కథ మీద నమ్మకంతో ఎక్కడా రాజీ పడకుండా చాలా అద్భుతంగా తీర్చిదిద్దాము. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. చాలా మంచి సినిమా ఇది. మీడియా మిత్రులందరూ ఈ సినిమాకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా మంచి సినిమా ఇది. మీ అందరికీ నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను.

నిర్మాత కీర్తన మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 18న మా సినిమా థియేటర్‌లోకి వస్తుంది. ఆడియన్స్ అందరూ చూసి ఫ్యామిలీని కూడా తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను. మా టీమ్ అంతా సినిమా కోసం చాలా కష్టపడ్డారు. మా డైరెక్టర్ గారి డెడికేషన్ నాకు చాలా నచ్చింది. చాలా అద్భుతమైన కథ ఇది. అలాగే మా హీరో గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: