అసెంబ్లీ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉంది

Shantikumari

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు&period; ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు&comma; సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు&comma; డీజీపీలు&comma; సీఈవోలు ఇతర అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది&period; ఈ సందర్భంగా తెలంగాణ సీఎస్ శాంతికుమారి&comma; డీజీపీ అంజనీ కుమార్‌లు రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు&period; సాధారణ నేర కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయన్నారు&period; సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు&comma; డీజీపీలతో మాట్లాడి సరిహద్దు చెక్ పోస్టులను కట్టుదిట్టం చేశామన్నారు&period; రాష్ట్రంలో నిఘా మరింత పెంచామన్నారు&period; ఇప్పటి వరకు రూ&period;385 కోట్ల మేర నగదును జప్తు చేసినట్లు చెప్పారు&period; 182 మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామన్నారు&period; తెలంగాణ సరిహద్దులోని పదిహేడు జిల్లాల్లో 166 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు&period; సరిహద్దుల్లోని పొరుగు రాష్ట్రాల్లో 154 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు&period; ప్రజల రాకపోకలకు అవకాశం లేకుండా పోలింగ్ తేదీకి ముందే సరిహద్దులను మూసివేసి&comma; అప్రమత్తంగా ఉండాలని సూచిన్నట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..

గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..

విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..