మూడో సారి కూడా కేసీఆర్ ని గెలిపించండి – ఎమ్మెల్యే సతీష్

brs

Advertisements

&NewLine;<p>సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్వో కార్యాలయంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్&comma; మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తో కలిసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి&comma; ఎమ్మెల్యే సతీష్ కుమార్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు&period; అంతకుముందు స్థానిక శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో నామినేషన్ పత్రాలతో ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; అదే సమయంలో అక్కడే ఉన్న హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తో కరచాలనం చేసి కాసేపు ముచ్చటించారు&period; అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ఆర్వో కార్యాలయానికి తరలి వెళ్లారు&period; ఆర్వో కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అనంతరం ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ 2014 కు ముందు ఉన్న పరిస్థితి&comma; ఇప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గంలో&comma; రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని&comma; మార్పును ప్రజలు గమనించాలన్నారు&period;<br>ఒకప్పుడు కరువు కాటకాలతో మెట్ట ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్ లో ఇప్పుడు భూగర్భ జలాలు పెరిగి సంతోషంగా&comma; సుభిక్షంగా రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు&period; అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు&comma; తనను కూడా మూడో సారి గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్