ప్రతిపక్ష ఎం పి లను పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయడం పై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరుగుతుంది అని యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండం ఉమేష్ రెడ్డి అన్నారు. కూకట్ పల్లి కే.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ లో పార్లమెంట్ లో ప్రశ్నించిన ప్రతిపక్ష ఎంపీలను నిరంకుశంగా సస్పెన్షన్ చేసిన దేశ ప్రధాని నరేంద్రమోదీ పై చర్యలు తీసుకోవాలని స్టేషన్ హౌస్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ కి యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి బండం ఉమేష్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ డిసెంబర్ 22 న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో 143 మంది ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ప్రధాని మోదీ ప్రభుత్వ నిరంకుశ, ఫాసిస్టు పాలనను ప్రశ్నించినందుకు అక్కసుగా ఆ 143 మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చెయ్యడం పై ధ్వజమెత్తారు. రాష్ట్రం లో బి.ఆర్.ఎస్ నియంతృత పాలనకు ప్రజలు ఏ విధంగా బుద్ది చెప్పారో అదేవిధంగా దేశంలోని ప్రజలు ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని కూల్చి వేస్తారని అన్నారు. రాబోవు రోజుల్లో ఇదే విధంగా ప్రతిపక్ష ఎంపీలను సస్పెన్షన్ చేస్తే ఢిల్లీ స్థాయి వరకు ఉద్యమాన్ని తీసుకెళ్తామని, పార్లమెంటును ముట్టడి చేస్తామని యువజన కాంగ్రెస్ పార్టీ తరుపున మోదీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని అన్నారు.
నిరంకుశ, ఫాసిస్టు పాలన…
416
previous post