తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈనెల 5న కనిగిరి నియోజకవర్గంలో నిర్వహించే 2024 ఎన్నికల సమర శంఖారావానికి వేలాది సంఖ్యలో పాల్గొనాలని టిడిపి మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నేడు దర్శి టీడీపీ పార్టీ ఆఫీసులో దర్శి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా టిడిపి మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2024 లో జరిగేటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో తెలుగుదేశం జెండా ఎగరబోతుందని అన్నారు. 2024 ఎలక్షన్ సమర శంఖారావానికి కనిగిరి వేదిక కావడం మరింత శుభ పరిణామం అని ఈ కార్యక్రమానికి లక్షల సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు తెలిపారు. అలాగే జరిగినటువంటి నాలుగున్నర సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు కార్యక్రమాలు తప్ప ప్రకాశం జిల్లాకి చేసింది ఏమీ లేదంటూ పత్తిపాటి పుల్లారావు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి 175 కి 175 సీట్లు వస్తాయని ఇప్పటికీ పగటి కలలు కంటున్నాడని, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా పరదాల చాటు నుంచి బయటికి చూస్తే ఆయనకు అర్థమవుతుంది ప్రజలు ఏ వైపు ఉన్నారనేది అంటు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు.
ఎన్నికల శంఖారావ సభ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం…
71
previous post