ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను తొలగించి ఆ నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే… చింతలపూడి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న ఉన్నమట్ల ఎలిజా స్థానంలో మరొక అధికారికి అవకాశం ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఏలూరు ఆర్టీఏ వెహికల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న విజయరాజుకు చింతలపూడి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సీఎం జగన్ చింతలపూడి ఎమ్మెల్యే కు నో చెప్పినట్లు తెలుస్తుంది. తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ తో చింతలపూడి టికెట్ తనకే ఇవ్వాలంటూ ప్రాధేయపడినప్పటికీ, చింతలపూడి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ఎలిజాకు స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాల్లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఎమ్మెల్యే ఎలిజాను అమలాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ప్రతిపాదన చేశారని అయితే తాను చింతలపూడిలోనే పోటీ చేస్తానని ఎంపీగా పోటీ చేయనని అన్నట్లు తెలుస్తుంది. దీనికి తోడు తాజాగా తన అనుచర గణంతో తాడేపల్లిలోని మిథున్ రెడ్డి ఇంటి వద్ద తనకే టిక్కెట్ ఇవ్వాలంటూ తన అనుచరులతో ధర్నాలు చేయించారు. ఒకవేళ వైసీపీ అధిష్టానం తలొగ్గి ఎలిజాకు టికెట్ ఇస్తే ఈసారి తప్పకుండా చింతలపూడిలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగులుతుందని పార్టీ వర్గాల్లో, ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చింతలపూడి ఎమ్మెల్యేగా గెలిచిన ఎలిజా ఇప్పటికే దండుగా ప్రజావ్యతిరేకతను మూట కట్టుకున్నారు, ఐప్యాక్ సర్వేలో ఎమ్మెల్యే ఎలిజాకు మైనస్ మార్కులు రావడంతో సీఎం జగన్ ఎమ్మెల్యే ఎలిజానుపక్కన పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి.
జీఎస్టీ కమిషనర్ ఉద్యోగి గా పనిచేసిన ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా ఉద్యోగాన్ని పక్కన పెట్టి 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. అంతకముందు టీడీపీ కంచు కోటగా చింతలపూడి నియోజకవర్గం ఉండేది. 1983 నుంచి 1999 వరకు ఐదు సార్లు టీడీపీ తరుపున పోటీ చేసిన కోటగిరి విద్యార్ధ రావు గెలుపొందారు. ఆ తరవాత సామాజిక సమీకారణాల నేపథ్యంలో జనరల్ నియోజకవర్గంగా ఉన్న చింతలపూడి ఎస్సి నియోజకవర్గంగా మారింది. 2014 లో మాజీ మంత్రి పీతల సుజాత టీడీపీ తరుపున పోటి చేసి గెలిపోందారు. 2019లో ఫ్యాన్ గాలిలో గెలిచిన ఎలిజా వలన జరిగిన నియోజక వర్గ అభివృద్ధి దేవుడెరుగు ఎక్కడ రూపాయి వస్తుందో అక్కడికి వాలిపోవడమే కాకుండా ఎమ్మెల్యే గా నాలుగు సంవత్సరాల కాలంలో కోట్లాది రూపాయలు వెనకేసారని నియోజకవర్గంలో టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే దోచుకోవడం దాచుకోవడమే పనిగా పెట్టుకున్న ఎమ్మెల్యే ఎలిజాపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఎమ్మెల్యేగా మా గ్రామంలో ఎం అభివృద్ధి చేసావు.. మాకిచ్చిన హామీలు ఎక్కడా అంటూ ప్రజలు నిలదీస్తున్నడంతో తిరిగి ఎమ్మెల్యే ఎలిజాకు నియోజకవర్గంలో టికెట్ ఇస్తే పరాజయం తప్పదని తెలుసుకున్న పార్టీ అధిష్టానం కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది.
చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా కొత్త వ్యక్తిని నిలబట్టేందుకు వైసీపీ అధిష్టానం కార్యాచరణ రూపొందిస్తే…. టిడిపికి కంచుకోటగా ఉన్న చింతలపూడి నియోజకవర్గాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టిడిపి జెండా ఎగరవేసేందుకు తెలుగుదేశం పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తుండట… ఇందులో భాగంగానే ఎన్నారై గా ఉన్న బొమ్మాజీ అనిల్ టిడిపి టికెట్ కోసం తన ప్రయత్నాలు జరుపుతూనే… నియోజకవర్గంలో జరుగుతున్న టిడిపి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటూ నియోజకవర్గ టిడిపిలో చక్రం తిప్పే నేతల మద్దతు కూడా కూడబెట్టి, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై అధికార పార్టీపై పోరాడుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇటీవల నారా లోకేష్ చేపట్టిన యువగళమ్ పాదయాత్ర చింతలపూడి నియోజకవర్గంలో దాదాపు మూడు రోజులపాటు సాగింది. నారా లోకేష్ పాదయాత్రను విజయవంతం చేయడంలో కూడా బొమ్మాజీ అనిల్ కృషి చేశారని టిడిపి వర్గాలు కూడా అనిల్ కు ఈసారి టిక్కెట్ ఇస్తే నియోజకవర్గంలో టిడిపికి పూర్వ వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా టిడిపి టికెట్ కోసం మరో ఎన్నారై సొంగా రోషన్ కుమార్ కూడా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. గత కొంతకాలంగా సొంగ రోషన్ కుమార్ టిడిపిలో పనిచేస్తూ నియోజకవర్గంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇటు నియోజకవర్గంలో టిడిపి చేపట్టే కార్యక్రమంలో పాల్గొంటూ పార్టీ టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోను పార్టీ జెండా ఎగరవేస్తానని పార్టీ బాస్ వద్ద టిక్కెట్ కోసం తన ప్రయత్నాలు జరుపుతున్నారు. వీరితో పాటు మాజీ మంత్రి పీతల సుజాత, మరి కొంతమంది ఆసవాహులు టికెట్ కోసం తమ ప్రయత్నాలు తాము జరుపుతున్నారు.
చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీ కొత్త వారికి ఛాన్స్ ఇచ్చి… అక్కడ పాగా వేయాలని చూస్తుంటే… వైసీపీ చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజాక్షేత్రంలో బట్టబయలు చేస్తూ టిడిపి కంచుకోట ను కైవసం చేసుకునేందుకు ఇటు టిడిపి గట్టి ప్రయత్నాలు చేస్తుంది. దీంతో చింతలపూడి నియోజకవర్గంలో అటు టిడిపి ఇటు వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా కొత్తవారు బరిలో నిలుస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.