రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రాక్షస పాలనను అంతమొందించడానికి ‘రా కదలిరా’ పేరిట మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టారని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 7న చంద్రబాబు ఆచంట పర్యటన ఖరారైన నేపథ్యంలో స్థానిక స్వీట్ హోమ్ ఏడు ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ, పార్కింగ్, హెలిప్యాడ్లను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం రగిలించడానికి చంద్రబాబు చేపట్టిన బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతులు నిరుద్యోగ యువత సుమారు 1,30,000 మంది ఈ కార్యక్రమానికి హజరవునున్నారని ముఖ్యంగా దళిత కులానికి చెందిన కుల సంఘాలు కదలి వస్తున్నాయని రాష్ట్ర స్థాయిలోను, ఉభయ గోదావరి జిల్లా స్థాయిలోను ముఖ్యంగా యువత, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని అన్నారు. ఆచంట లో పెద్ద ఎత్తున జరిగే రా కదలిరా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఇదే ఆహ్వానంగా భావించాలని పిలుపునిచ్చారు. జరగబోయే ఎన్నికలకు ఇది ఒక శంఖారావ సభలా ప్రతి ఒక్కరూ పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. అలాగే జనసేన పార్టీకి చెందిన ఇంచార్జి లు పాల్గొంటారని ఆయన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు ఇన్ని రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా సీఎం జగన్ కు కనికరం లేకుండా పోయిందని మండిపడ్డారు.
87
previous post