వైద్యం కోసం వచ్చే ప్రతి సామాన్యుడికి అన్ని రకాల మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తేవడమే ఈ వంద పడకల ఆసుపత్రి ప్రధాన లక్ష్యమని శాసన మండలి డిప్యూటి చైర్మన్ జకియా ఖానం, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ గిరిషా పీఎస్ అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి లో సుమారు 23 కోట్లతో నూతనంగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని శాసన మండలి డిప్యూటి చైర్మన్ జకియా ఖానం, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ గిరిషా పీఎస్ లు ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా హాజరైన వారికీ ఆసుపత్రి అభివృద్ధి కమిటి సభ్యులు బేపారి మహమ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాష, ఆసుపత్రి అభివృద్ధి కమిటి సభ్యులు బేపారి మహమ్మద్ ఖాన్, అన్నమయ్య జిల్లా డి ఎం హెచ్వో కొండయ్య, ప్రాంతీయ వైద్యశాల సూపరిటెండెంట్ డేవిడ్ సుకుమార్, ప్రముఖ సీనియర్ వైద్యులు బయా రెడ్డి, నారాయణ రెడ్డి లతో పాటు ఇతర ముఖ్యమైన అధికారులు, వైకాప నాయకులతో కలిసి ఆసుపత్రి ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడ నుండి వేద మంత్రాలు, మేళ తాళాల నడుమ పూర్ణ కుంభం తో ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్దకు చేరుకొని జ్యోతి ప్రజ్వలన గావించారు. ఆసుపత్రి లో వివధ రకాల వైద్య సేవలందించే గదులను ప్రారంభించి వైద్యం కోసం వచ్చే రోగులకు సంబంధించిన వసతులను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ దినం చాల చారిత్రాత్మక దినం అన్నారు. వందపడకల ఆసుపత్రి రోగులకు అందుబాటులోకి రావడంతో రాయచోటి ప్రజల చిరకాల కోరిక నేటితో నేరవేరిందన్నారు. ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి మొట్ట మొదటి సారిగా రాయచోటిలో పర్యటించినప్పుడు వందపడకల ఆసుపత్రి నిర్మాణం కొరకు శంకు స్థాపన చేశారన్నారు. అయితే కరోనా కారణంగా ఆలస్యం అయ్యిందన్న శ్రీకాంత్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో పాటు పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి, కలెక్టర్ గిరిషా పీఎస్ ల సహకారంతో త్వరిత గతిన నిర్మాణాలను పూర్తీ చేసుకొని ఈ రోజు అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలోనే సిటి స్కాన్, 8 బెడ్లు ఉన్న డయాలసిస్ ను 20 బెడ్లకు పెంచే విధంగా కృషి చేస్తామన్నారు.
నేటితో నెరవేరిన రాయచోటి ప్రజల చిరకాల కోరిక….
72
previous post