106
విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 11వ డివిజన్ కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. కేశినేని నాని నిర్ణయంతో ఈరోజు కార్పొరేటర్ పదవికి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. ఈరోజు ఉదయం 8:30 గంటలకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయానికి వెళ్లి గడిచిన కార్పొరేషన్ ఎన్నికల్లో తనకు సహకరించినందుకు ధన్యవాదాలు చెబుతారు. 9 గంటలకు అక్కడ కార్పొరేషన్ పరిధిలో తనకు సహకరించిన వారికి ధన్యవాదాలు చెబుతారు. 10:30 గంటలకు విజయవాడ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి మేయర్ మున్సిపల్ కమిషనర్‌ను కలిసి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా ఇచ్చి ఆమోదింప చేయాలని కోరుతారు.