దేశంలో అత్యధిక భక్తులు సందర్శించే జాతర మేడారం. అయితే వచ్చే నెలలో జరగబోయే మేడారం జాతర నిర్వహణకు, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక శ్రధ్ద చూపుతోంది. వచ్చే నెలలో జరగబోయే మేడారం మహా జాతరకు కోటిన్నర మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నదని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖకు సూచించింది. మేడారం సమ్మక్క సారక్క జాతరపై హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ ఆర్డీలో మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకమైన సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లను విడుదల చేసిందన్నారు. ఈ జాతరలో గిరిజన, ఆదివాసీ సంప్రదాయ నృత్యలతో పాటు ఇతర రాష్ట్రాల కళాకారుల బృందాలతో ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతరలో మీడియా సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ దఫా జాతర ప్రాంతాన్ని 10 జోన్లుగా వర్గీకరించాలన్నారు. భక్తులు.. వన దేవతలను ప్రశాంతంగా దర్శించుకుని తిరిగి అంతే ప్రశాంతంగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
Read Also..