మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంకల్పం లో భాగంగా నేటి ఉదయం గొల్లపూడి లో పల్లె పిలుస్తోంది రా కదలిరా పేరుతో టీడీపీ భోగి సంకల్పం నిర్వహించారు. తొలుత గొల్లపూడి వన్ సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి భోగి మంటలు వేసిన తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా. ఏపీకి పట్టిన కీడు తొలగాలని కోరుకుంటూ సమస్యల ఫోటోలను, జగన్ ప్రభుత్వ అక్రమ జీవోలను దేవినేని ఉమ, జనసేన తెదేపా శ్రేణులు, మరియు గ్రామస్తులు భోగిమంటల్లో తగలబెట్టారు. సైకో పోవాలి.. సైకిల్ రావాలి’.. కీడు తొలగాలి.. ఏపీ వెలగాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో గొల్లపూడిని హోరెత్తించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఉమా మాట్లాడుతూ తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ పథకాల ఆరాధ్యుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటారు తెలుగువారి ఆత్మవిశ్వాసాన్ని చంద్రబాబు నిలబెట్టారు అన్నారు. 55 నెలల్లో ప్రజా పరిపాలన విధ్వంసం అయ్యిందని చంద్రబాబు నాయుడు జాతి సంపద సృష్టించేవాడని వివరించారు. ఐటీ రంగ విప్లవంతో అద్భుతాలు సృష్టించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. అబద్దపు హామీలతో నమ్మించి, వంచించిన జగన్ పై, వైసీపీపై ప్రజలు కోపంతో రగిలి పోతున్నారన్నారు. 175 నియోజకవర్గాల్లో టిడిపి, జనసేన నేతల గెలుపు ఖాయమని అన్నారు. అందరూ పండుగలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నామన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండి రామరాజ్యం రావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సైకో పోవాలి.. సైకిల్ రావాలి.. కీడు తొలగాలి.. ఏపీ వెలగాలి
87
previous post