75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అవనిగడ్డ నియోజకవర్గంవ్యాప్తంగా ప్రభుత్వం, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలువద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాలు రెపరెపలాడాయి. అవనిగడ్డ లో వైసీపీ కార్యలయం వద్ద ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, గాంధీ క్షేత్రం వద్ద మాజీ ఉపసభాపతి టీడీపీ నాయకులు మండలి బుద్ధ ప్రసాద్, జనసేన పార్టీ కార్యలయం వద్ద చిలకలపూడి పాపరావు, అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని పోలీసులు స్టేషన్ వద్ద సబ్ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ, మండలపరిషత్ కార్యయలు వద్ద అదికారులు ప్రజాప్రతినిధులు, వివిధ పాఠశాలలు చెందిన విద్యార్థులు లతో కలిసి, జాతిపిత మహాత్మా గాంధీ, స్వతంత్ర సమరయోధులకు, జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం, జాతీయ జెండాలను ఎగరవేసి గౌరవ వందనాలు స్వీకరించారు. విద్యార్థిని, విద్యార్థులు జాతీయ గీతాలు ఆలపించారు. అనతరం75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రసంగించి, స్వీట్లు పంపిణీ చేశారు.
Read Also..