అనంతపురం జిల్లా కంబదురు ములకనూరు 2 అంగన్వాడీ లో గర్భవతులకు బాలింతలకు కు పెట్టే పౌష్టికాహారం పక్కదారి. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న గ్రామస్తులు. సిడిపిఓ సమాచారం ఇవ్వడంతో ఆమె వెళ్లి తనిఖీ చేశారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం ములకనూరులోని అంగన్‌వాడీ కేంద్రం – 2 లో అంగన్వాడీ సిబ్బంది పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టించినదని రెడ్ హ్యాండెడ్ గా గ్రామస్తులు పట్టుకున్నారు. అయితే అంగన్వాడీలు సమ్మె బాట పట్టిన సమయంలో జరిగిందా ఇప్పుడు జరిగిందా అనే అనుమాలు వ్యక్తమవుతున్నాయి. అంగన్వాడి సెంటర్ కు చెందిన టాయిలెట్ గదిలో దాచిన ఐదు కేజీల గల పది ప్యాకెట్లు బియ్యం, 20 ఆయిల్, గోధుమ పిండి, 10 ప్యాకేట్లు కందిబ్యాగులు, ఈ నెల పంపిణీ చేయాల్సిన పౌష్టికాహారాన్ని టాయిలెట్ గదిలో దాచడంతో గ్రామస్తులు తాళాలు పగలగొట్టి అందులో లభ్యమైన పౌష్టికాహారాన్ని బయట పెట్టి గుట్టు రట్టు చేశారు. సిడిపిఓ పక్కదారి పట్టించిన అంగన్వాడి సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాలింతలకు కు పెట్టే పౌష్టికాహారం పక్కదారి..
47
previous post