రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగనన్న ఇళ్ల నిర్మాణాలలో భాగంగా పేద ప్రజలు కేటాయించిన కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడం జరుగుతుందని మాజీ మంత్రి కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలంలోని నేమాం గ్రామంలో 3,4 లేఅవుట్ నందు సుజల స్రవంతి పథకం కింద సుమారు 11 కోట్లతో వాటర్ ట్యాంక్ నిర్మాణాలు, ఇంటింటికీ కుళాయిలు పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న కాలనీలకు కరెంట్ కొరత లేకుండా33/11 విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. అనంతరం తిమ్మాపురం లేఅవుట్ సుజల స్రవంతి పథకం కింద కాలనీ వారికి ఇంటింటికి కుళాయి పనులకు శ్రీకారం చుట్టారు. 33/11కేవి విద్యుత్ సబ్ స్టేషను ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కన్నబాబు మాట్లాడుతూ పేద ప్రజలు నిర్మించుకుంటున్న కాలనీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఉద్దేశంతో త్రాగునీరు విద్యుత్ సబ్ స్టేషన్లో నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రత్యేకమైన రూపకల్పనతో క్రమబద్ధీకరమైన పనులను చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, నేమాం సర్పంచ్ రాందేవ్ చిన్న, తదితరులు పాల్గొన్నారు.
సుజల స్రవంతి పథకం.. ఇంటింటికీ కుళాయిలు..
81
previous post