వైసీపీ పార్టీ (YCP Party) తీరుపై విమర్శలు:
మూడు నెలల క్రితం నవంబర్ 25వ తేదీన ఉభయగోదావరి జిల్లా పంచాయతీరాజ్ జోనల్ ఇంచార్జ్ పదవికి వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి నవంబర్ 28వ తేదీన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ లోకేష్ చేతుల మీదుగా పార్టీ తీర్థం పుచ్చుకున్న నన్ను మరలా ఈరోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉభయగోదావరి జిల్లా జోనల్ ఇన్చార్జిగా ప్రకటించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అప్పటి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన మేకల హనుమంతరావు పేరును తొలగించి కేవలం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి పదవులు కేటాయించడంపై ఎంపీపీ బుజ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీలో కనీసం పరిశీలన లేకుండా వ్యవహరిస్తున్న పార్టీ తీరుపై విమర్శలు కురిపించారు. నాకు కేటాయించిన పంచాయతీ రాజ్ జోనల్ ఇంచార్జ్ తక్షణమే రద్దు చేయాలంటూ ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.