కరీంనగర్ రూరల్ మరియు హుజురాబాద్ డివిజన్ నందు ఫ్లాగ్ మార్చ్(flag march) నిర్వహించిన ఆర్ఎఎఫ్ (రాపిడ్ యాక్షన్ ఫోర్స్) బలగాలు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఫెమిలైజేషన్ ఎక్ససైజ్ లో భాగంగా కరీంనగర్ కు విచ్చేసిన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలతో కరీంనగర్ రూరల్ డివిజన్ లోని మానకొండూరు మండల కేంద్రం, హుజురాబాద్(Huzurabad) డివిజన్ లోని హుజురాబాద్, జమ్మికుంట లలో గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా గుర్తించిన పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చినందు ఆర్.ఏ.ఎఫ్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు మరియు స్పెషల్ యాక్షన్ టీం పోలీసులు పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సేవలు వినియోగించనున్నామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ అడిషనల్ కమాండెంట్ బిస్వ రంజన్ సాహు అడిషనల్ డీసీపీ సి రాజు, రూరల్ ఏసీపీ వెంకటరమణ, హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాసులు ఇన్స్పెక్టర్ లు రాజ్ కుమార్ (మానకొండూరు), రమేష్ (హుజురాబాద్), రవి (జమ్మికుంట ) రోషన్ (ఆర్.ఏ.ఎఫ్) లలితగోప్ నారాయణ్ (ఆర్.ఏ.ఎఫ్), సురేష్ ( ఆర్.ఐ.అడ్మిన్) ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి