Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Political ప్రధాని పర్యటనకు భారీ బందోబస్తు…

ప్రధాని పర్యటనకు భారీ బందోబస్తు…

by Prakash
PM Modi visit to adilabad

దేశ ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వివరాలు………!

ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో నేడు పర్యటించనున్న భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. లోక్ సభ ఎన్నికల శంఖారావం లో భాగంగా అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధాన మంత్రి పర్యటన. ఢిల్లీ(Delhi) నుండి బయలు దేరి ఉదయం 10 గంటల 20 నిమిషాలకు అదిలాబాద్ జిల్లా కేంద్రంలోనీ హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 10 గంటల 30 నిమిషాలకు రోడ్డు మార్గం గుండా జాతీయ స్థాయిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు చేయనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. 11గంటల 5 నిమిషాలకు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు శంఖుస్థాపన కార్యక్రమాల అనంతరం అదిలాబాద్ జిల్లా కేంద్రం లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో పాల్గోని ప్రసంగించనున్న ప్రధాన మంత్రి. 12 గంటల 15 నిమిషాలకు తిరిగి ప్రధాన మంత్రి హెలికాప్టర్ ద్వారా వెళ్లానున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

PM Modi: ప్రధాని పర్యటనకు భారీ బందోబస్తు…

2వేల మంది పోలీసులు, కమెండోలు. ఎస్పీజీ వలయంలో స్టేడియం, ఏరోడ్రమ్. ప్రధాని మోదీ ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు పోలీస్ శాఖ మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని 15 జిల్లాలకు చెందిన 1700 మంది పోలీసులతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. వారిని పది సెక్టార్లుగా విభజించి విధులు కేటాయించారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ), గ్రేహౌండ్స్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్ డబ్ల్యూ) వంటి కేంద్ర బలగాలకు చెందిన మరో 300 మందితో రక్షణ కల్పించనున్నారు. మొత్తం 2 వేల మంది పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రధానితో
సీఎం రేవంత్ రెడ్డి……….!

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నరు ఉదయం 8గంటలకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి 9గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటారు. ఉదయం 9.30 నుంచి 11.15 గంటల వరకు స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ప్రధాని మోదీతో కలిసి వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన లో పాల్గొంటారు మధ్యాహ్నం 12గంటలకు ఆదిలాబాద్ నుంచి బయలుదేరి వెళ్తానున్నారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.
అమెరికా ఎన్నికల వ్యవస్థలో చైనా భారీగా జోక్యం చేసుకుందని, ఏకంగా 22 కోట్ల మంది ఓటర్ల …
అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.
అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలోని శ్రీ విరుపాక్షమ్మ తల్లి ఆలయంలో పుష్కరోత్సవ వేడుకలు ఘనంగా …
దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.
భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

041008
Total views : 212639

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: