ప్రకాశం జిల్లా పుల్లల చెరువు లో పంచాయతీ కార్యదర్శి మూడావత్ బాలునాయక్ ఎంపీడీఓ కార్యాలయం లో హరినాయక్ అనే వ్యక్తి నుండి పది వేలు లంచం తీసుకుంటుండగా ఎసీబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గతంలో హరినాయక్ తండ్రి ధర్మానాయక్ పుల్లల చెరువు పంచాయతీ పరిధిలో వీధి లైట్లు వర్క్ చేసారు. ఇటీవల ఆయన చనిపోయారు. ఈ నేపథ్యంలో వీధి లైట్లకు సంబంధించిన రెండు లక్షల బిల్లులను చెల్లించేందుకు పంచాయతీ కార్యదర్శి బాలునాయక్ హరినాయక్ ను ఇరవై వేలు లంచం డిమాండ్ చేయ్యగా ముందుగా హరినాయక్ ఐదు వేలు చెల్లించాడు. ఆ తరువాత పంచాయతీ కార్యదర్శి బాలునాయక్ కు లంచం ఇవ్వడం ఇష్టం లేని హరినాయక్ ఒంగోలు లోని ఎసీబి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పుల్లల చెరువు లోని ఎంపీడీఓ కార్యాలయం లో హరినాయక్ నుండి పది వేలు లంచం తీసుకుంటున్న పంచాయతీ అధికారి బాలునాయక్ ను ఎసీబి డిఎస్పీ శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి దాడి చేసి పట్టుకున్నారు. దీంతో బాలునాయక్ పై కేసు నమోదు చేసిన ఎసీబి అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన పంచాయతీ కార్యదర్శి…
104
previous post