జగన్ (Jagan) ను ఎలాగైనా గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో టీడీపీ, బీజేపీ, జనసేనలు ఏకమయ్యాయి..
ఎన్నికల వేళ… ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొత్త లొల్లి మొదలైంది. కాదేదీ ప్రచారానికి అనర్హం అన్నట్లుగా మారింది అక్కడి పార్టీల పరిస్థితి. జగన్ (Jagan) ను ఎలాగైనా గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో టీడీపీ, బీజేపీ, జనసేనలు ఏకమయ్యాయి. ఇప్పుడు కూటమి ప్రధానమైన ఓ అంశాన్ని తెరపైకి తెచ్చాయి. జగన్ హయాంలో అవినీతిపై ఫిర్యాదుల వెల్లువెత్తిందనేది వారు లెవనెత్తిన తాజా అంశం. దానికి వారు కొన్ని గణాంకాలు వెలువరిస్తున్నారు. కొన్ని నెలల క్రితం జగన్ సర్కారు అవినీతిపై ఫిర్యాదుల కోసం టో్ల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. దానికి నాటి నుంచి ఇప్పటి వరకు అవినీతిపై 8,03,612 ఫిర్యాదులు అందాయట. అంటే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 14400 ఆగకుండా మోగుతోందన్నమాట.
అవినీతిపై సర్వత్రా ఆందోళన..
ఇక మంత్రులు, వారి పేషీలపై 2 లక్షల 6 వేల ఫిర్యాదులు ఉన్నాయట. ఇక ఎమ్మెల్యేల అవినీతిపై వచ్చిన ఫిర్యాదుల సంఖ్య మామూలుగా లేదు. వారిపై ఏకంగా 4 లక్షల 39 వేల ఫిర్యాదులు అందాయి. దీంతో ఉన్నత స్థాయిలో అవినీతిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఏసీబీ అధికారులు ఉన్నది కింది స్థాయి ఉద్యోగులపై దాడులకు మాత్రమేనా? వారిపైనే ఏసీబీని ప్రయోగిస్తారా? అన్న అనుమానాలు వస్తున్నాయి. అంటే మంత్రులు, వారి పేషీలపై వచ్చిన ఫిర్యాదులను పట్టించుకోరా? అధికార పార్టీ నాయకులపై ఫిర్యాదులను వదిలేస్తారా? అన్నది ప్రధానమైన సందేహం. మరి అలాంటప్పుడు తన పాలనలో ఒక్క రూపాయి అవినీతి లేదన్న సీఎం వైఎస్ జగన్ మాటల్లో నిజమెంత? ఫిర్యాదులపై ఏటా మీడియాకు చెప్పే ఏసీబీ కొన్నాళ్లుగా ఎందుకు మౌనం వహిస్తోంది? ఏపీలో అవినీతిపై అహ్మదాబాద్ ఐఐఎం ఇచ్చిన నివేదికలో ఏముంది? అన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారిపోయింది.
ఇది చదవండి : కుందుల పై ఘాటుగా స్పందించిన బూరుగుపల్లి…
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి