Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh కుందుల పై ఘాటుగా స్పందించిన బూరుగుపల్లి…

కుందుల పై ఘాటుగా స్పందించిన బూరుగుపల్లి…

by Prakash
Boorugpalli Sesha Rao


నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కుందుల సత్యనారాయణ పై ఘాటుగా స్పందించిన తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బూరుగుపల్లి శేషారావు (Boorugpalli Sesha Rao)…

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు బూరుగుపల్లి శేషారావు (Boorugpalli Sesha Rao) ప్రెస్ మీట్ లో నిర్వహించారు. నిన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ ఆశావహులు కుందుల సత్యనారాయణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఆయన ఘాటుగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను స్టువర్టుపురం బ్యాచ్ అంటూ సంభోదించిన కుందుల వీర వెంకట సత్యనారాయణ పై ఆయన ఘాటుగా విరుచుకుపడ్డారు. లారీ క్లీనర్ దగ్గర నుండి మొదలైన నీ జీవితం అందరికీ తెలుసని, అక్రమ మద్యం తరలిస్తూ పోలీసులకు పట్టుబడి జైలు శిక్ష అనుభవించిన వాడివి నువ్వు అని, పార్టీ కోసం కష్టపడి పనిచేసే వ్యక్తినైన నన్ను నోటికొచ్చినట్లు వాగితే చూస్తూ ఊరుకోమని, పార్టీలోనే ఉంటూ పార్టీ కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెట్టి, పార్టీలో వర్గ విభేదాలు సృష్టిస్తున్న వ్యక్తి కుందుల సత్యనారాయణ అని ఎద్దేవా చేశారు.

పార్టీ కార్యకర్తలను నాయకులను కన్ఫ్యూజ్ చేసిన వ్యక్తి కుందుల సత్యనారాయణ

అధిష్టానం నుండి ఏ పిలుపు లేకుండానే తనకు సీటు ఇచ్చారంటూ ప్రచారం చేసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను కన్ఫ్యూజ్ చేసిన వ్యక్తి కుందుల సత్యనారాయణ అని అన్నారు. 2024 ఎన్నికలలో వైసీపీ పార్టీలకు సానుకూలంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం టిక్కెట్లు చీల్చే ఆలోచనతో కుందుల సత్యనారాయణ ఉన్నారని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నిన తాను మాత్రం తెలుగుదేశం, జనసేన భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ ను అఖండ మేజారిటీతో గెలిపించి తీరుతామని అన్నారు.

ఇది చదవండి : అమరావతి రైతుల పోరాటంపై ఎన్.వి. రమణ కీలక వ్యాఖ్యలు..!

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ …
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం …
గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.
కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019379
Total views : 90608

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.