గూగుల్ (Google)తన క్రోమ్(Chrome)వెబ్ బ్రౌజర్ కోసం ఒక భద్రతా ప్యాచ్‌ను విడుదల చేస్తోంది. Windows, macOS, Linux కంప్యూటర్‌లకు అందుబాటులో ఉంది. అప్ డేట్ కోసం తాజా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం గూగుల్ నుంచి ఆరో అప్ డేట్ ఇంది. ఇప్పటికే చాలా మంది వినియోగదారులు క్రోమ్ ను అప్‌డేట్ చేసుకున్నారు. తాజా గూగుల్ క్రోమ్(Google Chrome) అప్‌డేట్‌తో, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ (NIST) ద్వారా ట్రాక్ చేయబడిన సెక్యూరిటీ బగ్‌ను కంపెనీ CVE-2023-6345గా ప్యాచ్ చేసింది. వినియోగదారులు Chrome కోసం ఆటోమేటిక్ అప్‌డేట్‌లను ప్రారంభించాలి లేదా తాజా సంస్కరణలకు మాన్యువల్‌గా అప్‌డేట్ చేయాలని కంపెనీ కోరింది.
ఇది చదవండి: ఫోన్, ల్యాప్‌టాప్‌కి పబ్లిక్ ప్లేస్ తో ఛార్జింగ్ పెడుతున్నారా?
గూగుల్క్రోమ్లో పలు సాఫ్ట్వేర్ విభాగాల్లో కొన్ని హైరిస్క్సెక్యూరిటీ వల్నరబిలిటీస్ కనుగొన్నట్లు వివరించింది. ఇవి సైబర్‌నేరగాళ్లు సిస్టమ్‌ను హ్యాక్చేసేందుకు అవకాశం కల్పిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. క్రోమ్ బ్రౌజర్వాడేవారు వెంటనే దానిని అప్డేట్ చేసుకోవాలని కంప్యూటర్ఎమర్జెన్సీ రెస్పాన్స్టీంకు సమాచారమిచ్చింది. సెక్యూరిటీ లోపాలున్నాయ్! కస్టమ్ ట్యాబ్స్, వెబ్పీ హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో ఎర్రర్, ప్రాంప్ట్‌లు, ఇన్‌పుట్, ఇంటెంట్‌లు, ఇంటర్‌స్టీషియల్స్, పిక్చర్ ఇన్ పిక్చర్లో సెక్యూరిటీ లోపాలను గుర్తించినట్లు కంప్యూటర్ఎమర్జెన్సీ రెస్పాన్స్టీం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే గూగుల్ క్రోమ్ లో అప్ డేట్ తీసుకొచ్చింది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి