తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అఖిలపక్ష నాయకులు నరసరావుపేటలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఇంచార్జ్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు సహాయం చేయాలని హెచ్చరించారు. పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తుఫాన్ వల్ల నష్టాన్ని అంచనా వేయలేని వ్యవసాయ అధికారులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు చేతకాని వీళ్ళందర్నీ మేము ఒకటే హెచ్చరిస్తున్నాము. సకాలంలో మళ్లీ రెండో పంట వేసుకోవడానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా రైతులు రైతు బిడ్డల కన్నీళ్లను తుడవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు మాట్లాడుతూ పల్నాడు జిల్లా నర్సరావుపేట పరిసర ప్రాంతాల్లో వర్షాలు లేక వర్షాభావ పరిస్థితి లేక ఒకవైపు సాగర్ ఆయకట్టకు నీళ్లందకా మరొకవైపు దశాబ్ద కాలంగా రైతులు అవస్థలు పడుతున్నారు. దీనికోసం తలపెట్టిన ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పక్కన పెట్టింది. వరికపూడి శాల ప్రాజెక్టుకి ప్రభుత్వం దిగిపోయే సమయంలో ప్రజల్ని మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశాడు. ఈ ప్రాంతంలో ఉన్న రొంపిచర్ల మరియు శావల్యాపురం పరిసర కీలక మండలాలలో తొలిపంట వేయటం మానేసి చాలా సంవత్సరాలు అయింది. రెండో పంటగా ఉన్న శనగ, మినుము లాంటి పంటలు వేస్తే మొన్న వచ్చిన తుఫాను ఆ పంటలను మొలకలోనే మునిగిపోయి కుళ్ళిపోయేటట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. ముఖ్యమంత్రి తుఫాను బాధిత రైతుల పర్యటన అదేదో చంద్రబాబు నాయుడుని, సిపిఐ పార్టీని చూసి రోడ్డు మీదకు వచ్చి మొక్కుబడిగా క్రికెట్ ఆట చూడటానికి టెంటు వేసుకున్నట్లు ఉంది తప్ప అది రైతుల కష్టాలను చూసే పద్ధతి లాగా లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఆయన మీద ఉన్న కేసులు, బెయిల్ నుంచి రక్షణ పొందడానికి తప్ప ఈ రాష్ట్ర రైతాంగాన్ని ,దళితులను, గిరిజనులను, బీసీలను, మైనార్టీలను మొత్తంగా రాష్ట్ర ప్రజలను కాపాడడానికి కాదని ఆయన పదే పదే చెప్తున్నాడు. ప్రజలకు కూడా ఇప్పుడు బాగా అర్థమైంది అందువల్ల ముఖ్యంగా అఖిలపక్షాలు టిడిపి, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, జనసేన, ఎంఐఎం ఇతర ప్రజా సంఘాలు ఐక్యంగా సాధారణ పంట ధాన్యంకి ఎకరాకు 40000 ఇవ్వాలి, వాణిజ్య పంటలకు 75000 ఇవ్వాలి, ఉద్యాన పంటలకు లక్ష రూపాయలు ఇవ్వాలని ఈ ప్రకారం ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం కొట్టుకుపోతుందని హెచ్చరిస్తున్నామన్నారు.