కరాచీ బేకరీ లో పేలిన సిలిండర్.. ఆరుగురి పరిస్థితి విషమం

karachi bakery sylinder blast

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని కరాచీ బేకరీలో పేలుడు సంభవించింది&period; బేకరీలోని సిలిండర్ పేలడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది&period; ఈ ఘటనలో 15 మంది కార్మికులకు గాయాలయ్యాయి&period; వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది&period; గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు&period; ఈ ఘటనతో బేకరీలోని పరిస్థితి దారుణంగా తయారయింది&period; పేలుడు శబ్దానికి చుట్టుపక్కల వారు ఉలిక్కిపడ్డారు&period; పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు&period; శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధి&comma; గగన్ పహాడ్‌లోని కరాచీ బేకరీ గోడౌన్‌లో జరిగిన పేలుడుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు&period; క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య&comma; ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు&period; క్షతగాత్రుల్లో ఎక్కువ మంది ఉత్తర ప్రదేశ్‌కు చెందినవారు ఉన్నట్లుగా సీఎంకు అధికారులు తెలిపారు&period; గాయపడిన వారిలో ఎనిమిది మందిని కంచన్‌బాగ్ డీఆర్డీవో ఆసుపత్రికి తరలించినట్లు వారు ముఖ్యమంత్రికి చెప్పారు&period; కరాచీ బేకరీ గోడౌన్‌లో జరిగిన పేలుడు ధాటికి పదిహేను మంది కార్మికులు గాయపడ్డారు&period; ఇందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది&period; పేలుడు ఘటనపై పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దేశం రవాణా రంగంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతూ.

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి..

హైదరాబాద్‍లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే