రాజ్‌భవన్‌‌లో అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం

Akbaruddin Owaisi

Advertisements

&NewLine;<p>తెలంగాణ మూడో శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేశారు&period; శనివారం రాజ్‌భవన్‌‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళసై ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌తో ప్రమాణం చేయించారు&period; అల్లా సాక్షిగా అక్బరుద్దీన్ తన బాధ్యతలు నిర్వహిస్తానంటూ ప్రమాణం చేశారు&period; ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&comma; మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు&period; మంత్రులు à°¡à°¿&period;శ్రీధర్ బాబు&comma; తుమ్మల నాగేశ్వరరావు&comma; సీతక్క&comma; మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు&period; ఆర్టికల్ 178 ప్రకారం శాసనసభ కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే వరకూ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ సేవలందిస్తారంటూ గవర్నర్ ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు&period; అసెంబ్లీలో అందరికంటే సీనియర్ సభ్యుడు కావడంతో అక్బరుద్దీన్‌కు ప్రొటెం స్పీకర్ బాధ్యతలు దక్కాయి&period; నేడు జరగనున్న శాసనసభ తొలి సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్