700 ఏళ్లుగా వెలుగుతున్న అఖండ జ్యోతి.. ఎక్కడ ఉందో తెలుసా!

Akhanda Jyoti

Advertisements

&NewLine;<p>మనమంతా కాలంతో పాటు పరుగెడుతూ మన చుట్టూ ఎన్నో వింతలు&comma; విశేషాలను చూడలేకపోతున్నాం&period; చరిత్రకు సజీవ సాక్ష్యాలు ఉన్న వాటి గురించి తెలుసుకోలేకపోతున్నాం&period; అలాంటి వాటిలో ఈ ఆలయం కూడా ఒకటి&period; దాదాపు ఏడు వందల ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం ఇది&period; వందల ఏళ్లైనా చెక్కు చెదరని నిర్మాణాలు దీని సొంతం&period; ఎక్కడా లేని విధంగా 700 ఏళ్లుగా నిరంతరం వెలుగుతున్న అఖండజ్యోతి ఈ ఆలయం ప్రత్యేకత&period;నిజాం పాలనలో నిర్విఘ్నంగా పూజలు సాగిన ఆలయం&period; తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో అతి పురాతనమైన సీతారామాలయం&period;తెలంగాణ ప్రాంతాన్ని అనేక రాజవంశాలు పరిపాలించాయి&period; వారి పాలనకు గుర్తులుగా ఆయా ప్రాంతాల్లో పలు దేవాలయాలను అప్పటి రాజులు నిర్మించారు&period; అలాంటి ఆలయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట లోని అతి పురాతనమైన సీతారామాలయం ఒకటి&period; కాకతీయ పాలకుల కాలంలో దాదాపు క్రీస్తు శకం 1333లో నిర్మితమైన ఈ దేవాలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి&period; ఈ ఆలయంలో పురాతన లక్ష్మణ సమేత సీతారాముల మూల విగ్రహంతో పాటు 16 రాతి స్తంభాలతో నిర్మించిన కళ్యాణమంటపం&comma; గంట&comma; తటాకం నాటి ఇప్పటికీ చెక్కు చెదరలేదు&period; ఆలయంలోని గంటపై ఆలయ నిర్మాణానికి సంబంధించిన సంవత్సరం చెక్కబడి ఉంది&period; ప్రతాపరుద్రుని కాలంలో నిర్మాణం&period; ఓరుగల్లును పరిపాలించిన కాకతీయుల రాజ్యంలో కొన్ని గ్రామాలను పాలన పరంగా ప్రత్యేక గుర్తించేవారు&period; అలా గుర్తించిన వాటిలో గంభీరావుపేట ప్రధాన కేంద్రంగా ఉండేది&period; అందుకే అక్కడ ప్రత్యేకంగా లక్ష్మణ సమేత సీతారామాలయాన్ని నిర్మించారని చరిత్రకారులు చెబుతారు&period; కాకతీయ రాజులలో చివరివాడైన ప్రతాపరుద్రుని కాలంలో ఈ సీతారామాలయాన్ని నిర్మించినట్లు ప్రతీతి&period; నిజాం పాలనలో లింగన్నపేట సంస్థానానికి చెందిన శ్రీ వెంకటరావు దేశాయి సంస్థానాధీశులుగా ఉండేవాడు&period; ఈ ఆలయం పరిపాలన ఆయన కిందకి రావడంతో సీతారామాలయం అభివృద్దికి కృషి చేసినట్లు స్థానికులు చెబతుంటారు&period; ఆలయంలో పూజ కార్యక్రమాల కోసం దగ్గర్లోనే వెంకటాద్రి చెరువును నిర్మించారు&period; ఆ చెరువు నుంచే ఆలయంలో జరిగే ఉత్సవాల అన్నింటికీ నీటిని తెస్తుంటారు&period; ఇప్పటికీ ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు&period; నిజాం పాలనలో నిర్విఘ్నంగా పూజలు ఆలయంలో నందాదీపం 700 ఏళ్లుగా నిరంతరంగా వెలుగుతూనే ఉంది&period; మూల విగ్రహాల ప్రతిష్ఠకు ముందే ఆలయంలో నందా దీపంను ప్రతిష్ఠించినట్లు తెలుస్తుంది&period; నాటి నుంచి నేటి వరకు ఈ దీపం వెలుగుతూనే ఉంది&period; నిజాం కాలంలో సైతం ఈ ఆలయంలో నిర్విఘ్నంగా పూజలు సాగినట్లు ఆధారాలున్నాయి&period; ఈ నందా దీపం వెలుగుతుండడం వల్లే గ్రామస్తులు ఐశ్వర్యం&comma; ధాన్యం&comma; సమృద్ధిగా కలుగుతుందని ఇక్కడి ప్రజలకు ప్రగాఢ విశ్వాసం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..