మితిమీరుతున్నఇన్‌ఛార్జుల అరాచకాలు – ప్రత్తిపాటి

Prattipati Pullarao

Advertisements

&NewLine;<p>అడ్డదారుల్లో అధికార దర్పం ప్రదర్శిస్తున్న వైకాపా నియోజకవర్గ ఇంచార్జ్ à°² అరాచకాలు రోజురోజుకు పెచ్చు మీరుతున్నాయని మాజీమంత్రి&comma; తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు&period; రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ ఇలాంటి విపరీత పరిణామాలు చూడలేదని&comma; అధికారులు ప్రొటోకాల్ నిబంధనలు పక్కనపెట్టి ఇంచార్జిల పాలేర్లలా మారారని ధ్వజమెత్తారు&period; రాష్ట్రంలో కొద్దిరోజులుగా అనేక నియోజకవర్గాల్లో వైకాపా ఇంచార్జిల కేంద్రంగా చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన నిప్పులు చెరిగారు&period; వాళ్ళు ఏ హోదా&comma; ఏ అధికారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో సమీక్షలు నిర్వహిస్తున్నారు&quest; కీలక సమావేశాలకి ఎలా హాజరవుతున్నారు&quest; అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు&comma; ప్రారంభాలు&comma; చివరకు సంక్షేమ పథకాల పంపిణీలోనూ వైకాపా ఇన్‌ఛార్జ్‌à°² హవానే కనిపిస్తుండడానికి సమాధానం కోసం ఎవరిని ప్రశ్నించాలని ప్రత్తిపాటి అన్నారు&period; చిలకలూరిపేటలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడారు&period; ఒక దళిత యువకుడిని చంపి డోర్‌ డెలివరీ చేసింది కాక&comma; నేనే చంపాను అని చెప్పిన వ్యక్తికి పూల బొకేలు ఇచ్చి&comma; వంగివంగి సెల్యూట్‌లు కొట్టడానికి పోలీసులకు సిగ్గుండాలన్నారు&period; అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి సభల్లో ముందు వరసల్లో కూర్చోబెట్టి ఏ సందేశం ఇస్తున్నారో చెప్పాలన్నారు&period; జిల్లాల్లో కలెక్టరేట్లు&comma; మున్సిపల్ కార్యాలయాలు ఇలా ఎక్కడ చూసినా వైకాపా ఇంచార్జిల రాజ్యమే కనిపిస్తోందని ప్రత్తిపాటి ధ్వజమెత్తారు&period; వైకాపా నేతల తీరులో రాజకీయ ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తోన్నా అధికారులు మరీ ఇంతగా ఎందుకు సాగిలపడి వారికి వత్తాసు పలుకుతున్నారని నిలదీశారు&period; ప్రొటోకాల్ లేని వ్యక్తుల్ని అధికారిక సమావేశాలకు అనుమతించకూడదు&comma; ఎన్నికల తరుణంలో అలాంటి వారిని మరింత దూరం పెట్టాలి&comma; అలాంటిది నిబంధనలకు పాతరేసి వైకాపా ఇంచార్జిలే ప్రభుత్వం అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు దారుణమని ప్రత్తిపాటి అన్నారు&period; నిన్నటి వరకు ఊరు పేరు లేని వాళ్లంతా ఇవాళ వైకాపా ఇంచార్జిల పేరుతో నేరుగా ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తుంటే అక్కడి అధికార పార్టీ సిట్టింగ్‌లే నోరు వెళ్లబెట్టాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు&period; కలెక్టర్లు కూడా వైకాపా నేతల ముందు చేతులు కట్టుకుని కూర్చునే దుస్థితిని నేను ఎక్కడా చూడలేదని ప్రత్తిపాటి అన్నారు&period; వచ్చే ఎన్నికల్లో ఈ ఇంచార్జ్ లు అంతా శంకరగిరి మాన్యాలు పట్టుకు పోవడం ఖాయమని&comma; తర్వాత అధికారుల పరిస్థితేంటో ఆలోచించుకోవాలని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్