ఏపీ కేబినెట్ లో కీలక నిర్ణయాలకు ఆమోదం..

Advertisements

<p>ఏపీ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది&period; రాష్ట్ర అభివృద్ధి&comma; ప్రజా సంక్షేమం&comma; పరిపాలన సంస్కరణలే లక్ష్యంగా సుదీర్ఘంగా చర్చించి అనేక అంశాలను ఆమోదించారు&period; అమరావతి రాజధాని విషయంలో భవిష్యత్తులో ఎలాంటి మార్పులకు ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది&period; ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 5ను సవరించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది&period; సెక్షన్ 5&lpar;2&rpar;లో &&num;8220&semi;ఎట్ అమరావతి&&num;8221&semi; అనే పదాన్ని&comma; అలాగే అమరావతి అంటే ఏపీసీఆర్‌డీఏ చట్టం కింద నోటిఫై చేసిన ప్రాంతం అని స్పష్టంగా చేర్చాలని ప్రతిపాదించారు&period; గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో సృష్టించిన గందరగోళం పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది&period; రాజకీయ కక్ష సాధింపులతో రాజధానిని మార్చే దుశ్చర్యలకు పాల్పడకుండా&comma; అమరావతిని శాశ్వత రాజధానిగా&comma; ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పార్థసారథి వివరించారు&period;<&sol;p>&NewLine;<p>రాష్ట్రంలో పేరుకుపోయిన కేసుల భారాన్ని తగ్గించి&comma; ప్రజలకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతో న్యాయవ్యవస్థను బలోపేతం చేసేందుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది&period; హైకోర్టు ప్రతిపాదన మేరకు రాష్ట్రవ్యాప్తంగా 96 కొత్త కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు&period; ఈ 1&comma;730 పోస్టులను త్వరలో విడుదల చేసే జాబ్ క్యాలెండర్‌లో చేర్చే అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి తెలిపారు&period; బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం&comma; వడ్డెర సామాజిక వర్గానికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు చారిత్రక నిర్ణయం తీసుకుంది&period; వడ్డెర సంఘాలకు క్వారీ లీజులను ప్రాధాన్యత ప్రాతిపదికన కేటాయించడంతో పాటు&comma; ప్రీమియం&comma; సీనరేజ్ ఫీజులో 50 శాతం రాయితీ ఇవ్వడానికి రూపొందించిన మార్గదర్శకాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది&period; రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై ప్రభుత్వం దృష్టి సారించింది&period; హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టు ఫేజ్-1లో మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి&comma; పొంగనూరు బ్రాంచ్ కెనాల్ నిర్మాణంలో పెరిగిన అంచనా వ్యయానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది&period; కర్నూలు జిల్లాలోని గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ కింద 7 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌à°² నిర్వహణకు రూ&period;4&period;40 కోట్లు మంజూరు చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..