మార్కాపురం ఘటనలో 14కు చేరిన మృతుల సంఖ్య..

Advertisements

<p>ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన ఘటనలో 14 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు&period; మరో 28 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు&period; మంటలు క్షణాల్లో వ్యాపించడంతో బయటకు వచ్చే అవకాశం లేక లోపలే వారంతా కాలిబూడిదయ్యారు&period; మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు&comma; మహిళలే ఉన్నారు&period; పెదారికట్లకు చెందిన అంబటి అనిల్‌తో పాటు 5 నెలల పసికందు అంబటి లియో కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు&period; అలాగే చల్లగిరిగలకు చెందిన తమ్మిశెట్టి పిచ్చమ్మ&comma; తమ్మిశెట్టి రుక్మిణి&comma; తింగారెడ్డిపల్లికి చెందిన ఉప్పు రమాదేవి&comma; బత్తుల పద్మ ఈ దుర్ఘటనలో మరణించినట్లు అధికారులు గుర్తించారు&period; మిగిలిన మృతుల్లో దాసరిపల్లికి చెందిన ముత్తంగి వెంకటేశ్వర్లు&comma; ఉన్నగురువాయపాలెం వాసులు నర్సింగ్ ప్రభావతి&comma; నర్సింగ్ క్షేత్ర ఉన్నారు&period; వీరితో పాటు పనుగోడుకు చెందిన దేవాండ్ల రామయ్య&comma; మంగళకట్టకు చెందిన జయరామయ్య కూడా అగ్నిప్రమాదానికి బలయ్యారు&period; ఈ ఘటనతో ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి&period; బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>రాయవరం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు&period; ఈ సమీక్షకు మంత్రులు అనిత&comma; జనార్దన్‌రెడ్డి&comma; ఉన్నతాధికారులు హాజరయ్యారు&period; ప్రమాదం తీరుపై ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు జిల్లా కలెక్టర్‌&comma; ఎస్పీ వివరించారు&period; క్షతగాత్రులకు మెరుగైన వైద్యంతో పాటు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు&period;<&sol;p>&NewLine;<p>రాయవరం సమీపంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ఏపీ క్యాబినెట్‌లో చర్చ జరిగింది&period; మృతులకు మంత్రివర్గం సంతాపం తెలిపింది&period; బాధిత కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది&period; ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ&period;5లక్షలు&comma; గాయపడిన వారికి 2లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆదేశించారు&period; బాధితులకు అందుతున్న వైద్యాన్ని పర్యవేక్షించాలని మంత్రులు&comma; అధికారులకు సూచించారు&period;<&sol;p>&NewLine;<p>బస్సు ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు&period; మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు&period; క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు&period; ఈ ఘటనపై ఏపీ అధికారులతో మాట్లాడాలని సీఎస్‌ రామకృష్ణారావును ఆదేశించారు&period; బస్సు జగిత్యాల నుంచి బయల్దేరిన నేపథ్యంలో ప్రయాణికుల వివరాలు తెలుసుకోవాలన్నారు&period; సీఎం ఆదేశాలతో ఏపీ సీఎస్‌తో తెలంగాణ సీఎస్‌ మాట్లాడారు&period;<br &sol;>&NewLine;మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము&comma; ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు&period; మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు&period; బస్సు ప్రమాదంలో పలువురు సజీవదహనం కావడం అత్యంత విషాదకరమని మోదీ అన్నారు&period; గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు&period; మృతుల కుటుంబాలకు 2లక్షలు&comma; గాయపడిన వారికి 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!