85
కడప జిల్లా, తమ డిమాండ్లను పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీ కార్యకర్తలు స్పష్టం చేశారు. 16వ రోజు సమ్మెలో భాగంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కార్యాలయాన్ని ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిడిపిఓ కార్యాలయం నుంచి తాడిపత్రి రోడ్డు మీదుగా ఎమ్మెల్యే కార్యాలయానికి అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీగా వచ్చారు. ఎమ్మెల్యే కార్యాలయానికి ఎదురుగా బయట నుంచి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 16 నెలలైనా తమ సమ్మెను విరమించబోమని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే పిఏకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.