కుప్పంలో అంగన్వాడి వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కుప్పం ఐసిడిఏస్ కార్యాలయం వద్ద నుండి పట్టణంలోని ఎమ్మెల్సీ భరత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ భరత్ పీఏ కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ, అంగన్వాడి వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 15 రోజులుగా సమ్మె చేపడుతున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని వారు పేర్కొన్నారు. అంగన్వాడిలకు కనీస వేతనం అమలు చేసి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు కోరారు.అంగన్వాడిల సమస్యలను పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. ఇప్పటికీ 4 సార్లు ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ యూనియన్లతో చర్చించినా అంగన్వాడిల డిమాండ్లను పరిష్కరించలేదన్నారు.
anganwadi workers protest rally
కడప జిల్లా, తమ డిమాండ్లను పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీ కార్యకర్తలు స్పష్టం చేశారు. 16వ రోజు సమ్మెలో భాగంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కార్యాలయాన్ని ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిడిపిఓ కార్యాలయం నుంచి తాడిపత్రి రోడ్డు మీదుగా ఎమ్మెల్యే కార్యాలయానికి అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీగా వచ్చారు. ఎమ్మెల్యే కార్యాలయానికి ఎదురుగా బయట నుంచి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 16 నెలలైనా తమ సమ్మెను విరమించబోమని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే పిఏకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లాలో అంగన్వాడీల సమ్మె 14వ రోజు కొనసాతుంది. గత 14 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడం లేదని అంగన్వాడీలు వాపోయారు. పండగ మీక, పస్తులు మాకా అంటూ నినాదాలు చేశారు. క్రిస్మస్ పండగ రోజైన సీఎం జగన్ అంగన్వాడీలకు శుభవార్త చెప్తారని ఎదురు చూస్తున్నామని అంగన్వాడీలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
విజయనగరం జిల్లా, సమస్యల పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీల ధర్నా. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ర్యాలీ చేపట్టారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు వి.లక్ష్మి హెచ్చరించారు. మంగళవారం గజపతినగరం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ఆందోళన చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మె బాట పట్టారు. అంగన్ వాడీ కేంద్రాలను మూసివేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించడంతో తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన..ఆందోళన చేపట్టనున్నారు. అన్ని మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రధానంగా వేతనాల పెంపు, గ్రాట్యూటీ కోసం డిమాండ్ చేస్తున్న వర్కర్లు.. అంగన్ వాడీలలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపిస్తున్నారు. హెల్త్ కార్డులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసారు.
అంగన్వాడి వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో తిరుపతి నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు అంగన్వాడి కార్యకర్తలు.ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.పక్క రాష్ట్రం తెలంగాణ కంటే అంగన్వాడీలకు ఎక్కువ జీతాలు ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీలకు 26 వేల జీతము , ఐదు లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని లేనిపక్షంలో తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరవదిక సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల ఆందోళన సమ్మెలో పాల్గొన్నారు.






Total views : 78750