91
అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల మూడో తేదీన కలెక్టరేట్ ముట్టడికి సిఐటియు పిలుపునిచ్చింది. ముట్టడిని పురస్కరించుకొని సిపిఎం, సిఐటియు, అంగన్వాడీల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా గురువారం సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుండి బోసుబొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పివి ఆంజనేయులు మాట్లాడుతూ మహిళలని చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, రైతు సంఘం, అంగన్వాడీలు, అంగన్వాడి హెల్పర్లు, కౌలు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.